అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇన్ని కష్టాలు పడటం అభిమానులు ఊహించలేదు. క్రమంగా ఈ పరిణామాలు ప్రాజెక్టు మీద బజ్ తగ్గించేసాయి. మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయ్యాక కూడా ఆ అవకాశాన్ని వాడుకోలేకపోవడం పెద్ద ట్రాజెడీ. మొన్నోసారి రెండు భాగాలు వస్తుందని అర్థం లేని గాసిప్ ఒకటి చక్కర్లు కొడితే దర్శకుడు వశిష్ఠ దాన్ని ఖండించారు.
ఇదిలా ఉండగా విశ్వంభరకు కొత్త రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 అంటూ మరో కొత్త ప్రచారం మొదలయ్యింది. నిజానికి ఆ మరుసటి వారమే నాని ది ప్యారడైజ్ ఉంది. ఇంత తక్కువ గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలు క్లాష్ అవ్వడం అంత సేఫ్ కాదు. ఇక్కడో ప్రాక్టికల్ యాంగిల్ ఏంటంటే చిరంజీవి, నానికి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీయబోయే నెక్స్ట్ మూవీలో మెగాస్టారే హీరో. నాని నిర్మాతని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఎవరికంటే ముందు విశ్వంభరకేనని చెప్పాలి. ఎందుకంటే ప్యారడైజ్ కి ఆల్రెడీ సరిపడా బజ్ ఉంది. పాటలు, ట్రైలర్ వచ్చాక ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ విషయాల్లో మెగా మూవీ వెనుకబడి ఉంది. అందుకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కీరవాణి కాకుండా గౌర హరిని తీసుకున్నారు. ఐటెం సాంగ్ ని భీమ్స్ తో కంపోజ్ చేయించారు. విఎఫ్ఎక్స్ చివరికి బాగా వచ్చాయా లేదా అనే క్లారిటీ ఇప్పటికీ లేదు. ఇన్ని సమస్యలున్నాయి.
అలాంటప్పుడు విశ్వంభరని సోలో రిలీజ్ చేయడం కోసం ట్రై చేయడం బెటర్. పైగా జైలర్ 2 కూడా స్వతంత్ర దినోత్సవం నాడే రావొచ్చని అంటున్నారు. బాలీవుడ్ లో సన్నీ డియోల్ లాహోర్ 1947 ఉంది. విశ్వంభర కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితమయ్యింది కాదు. అన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. ఇవన్నీ లెక్కలు వేసుకుని అప్పుడు విడుదల తేదీ నిర్ణయించుకోవాలి .సో ఎలా చూసుకున్నా విశ్వంభర ఇండిపెండెన్స్ డేకి రావడం ఆధారమే లేని అనుమానం.
Gulte Telugu Telugu Political and Movie News Updates