Movie News

ORRపై మరో విషాదం.. నటుడు.. కెమేరా మ్యాన్ బలి

ఈ నెల (మే) మొదటి రోజున హైదరాబాద్ కు చెందిన కుటుంబం.. సిరిసిల్లకు చెందిన మరో ఫ్యామిలీ కలిసి యాదాద్రి.. గోల్డెన్ టెంపుల్ ను సందర్శించుకొని.. తిరుగు ప్రయాణంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లే క్రమంలో ఔటర్ మీద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అమిత వేగంతో ఢీ కొట్టటం.. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు దుర్మరణం పాలు కాగా.. ఒకరికి తీవ్ర గాయాలు కావటం తెలిసిందే. ఇంచుమించు ఇదే తరహాలో దారుణ విషాదం ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది.

ఈసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు.. కెమేరా మ్యాన్ ఇరువురు దుర్మరణం పాలయ్యారు. మే ఒకటిన జరిగిన ఘోర ప్రమాదంలో శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ పదహారు వద్ద జరిగితే.. తాజాగా జరిగిన ప్రమాదం పెద్ద అంబర్ పేట సమీపంలోని ఓఆర్ ఆర్ ఎగ్జిట్ 12 వద్ద చోటు చేసుకుంది. ఈ రెండు ఉదంతాల్లో కారు తమ ముందున్న వాహనాల్ని బలంగా ఢీ కొట్టటం.. రెండు సందర్భాల్లో మితిమీరిన వేగంతో దూసుకెళ్లటమే కనిపిస్తుంది.

తాజా విషాద ఉదంతంలో ఇరువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదిభట్ల పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అతి వేగమే తాజా విషాదానికి కారణంగా తేల్చారు. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారును వెలికి తీసి.. అందులో ఇరుక్కుపోయిన బాడీలను వెలికి తీయటం కష్టమైంది.

చివరకు రెండు డెడ్ బాడీలకు పోస్టు మార్టం చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం నటుడు భరత్ కాంత్, కెమేరా మ్యాన్ గా పని చేసే సాయి త్రిలోక్ లు తమ సొంతూరైన నెల్లూరుకు వెళ్లి.. తిరిగి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న వేళలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పదేళ్ల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న వీరిద్దరూ తాజాగా నానక్ రాం గూడలో ఉంటున్నారు.

2024లో విడుదలైన ‘‘టెనెంట్’’ మూవీలో రిషి పాత్రలో నటించాడు. ఇతడి స్నేహితుడైన సాయి త్రిలోక్ పలు ప్రాజెక్టుల్లో కెమేరా మ్యాన్ గా వ్యవహరించాడు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఈ ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి కారు ఎవరు నడుపుతున్నారు? ప్రమాదానికి కారణమేంటి? ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగమెంత? లాంటి వివరాలను తేల్చాల్సి ఉంది.

సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలు కావటంపై చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ప్రయాణాల్లో అజాగ్రత్త.. మితిమీరిన వేగం.. నిద్రమత్తు ప్రాణాల్ని తీయటమే కాదు.. తమ గురించి కోటి ఆశల్ని పెట్టుకున్న కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

This post was last modified on May 11, 2026 12:56 pm

Share

Recent Posts

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

47 minutes ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

6 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

9 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

9 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

9 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

11 hours ago