మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల కిందట మొదలుపెట్టిన ‘విశ్వంభర’ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. చివరగా ప్రకటించినట్లు వేసవిలో ఈ సినిమా రావట్లేదు. సోషల్ మీడియాలో గత కొంత కాలంగా ప్రచారంలో డేట్, జులై 10కి అయినా సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ టీం ఎంతకీ ఆ విషయాన్ని ధ్రువీకరించట్లేదు. అలా అని విశ్వంభర టీం సైలెంటుగా ఉంటోందా అంటే అదీ లేదు.
ఇటీవలే త్రిష పుట్టిన రోజు నాడు సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఆ పోస్టర్లో రిలీజ్ డేట్ ప్రస్తావన లేదు. ఇప్పుడేమో దర్శకుడు వశిష్ఠ.. సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘విశ్వంభర’ను కూడా రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ఒక వార్త ప్రచారంలోకి వస్తే.. దానిపై వ్యంగ్యంగా ‘‘అవునా.. నిజమా’’ అంటూ స్పందించాడు వశిష్ఠ. దీన్ని బట్టి ఈ సినిమా రెండు భాగాలుగా రావట్లేదని.. ఒకటే పార్ట్ అని స్పష్టమైంది.
ఐతే విశ్వంభర ఒకటిగా వస్తుందా.. రెండు భాగాలుగానా అన్నదానిపై చిరు అభిమానులకు అసలు పట్టింపే లేదు. ముందు ఈ సినిమా రిలీజ్ కానీ అంటున్నారు. ఆ డేట్ ఏదో చెప్పండి మహాప్రభో అని సోషల్ మీడియాలో అదే పనిగా మొత్తుకుంటున్నారు. మంచి ఔట్ పుట్ కోసమే టీం టైం తీసుకుంటోందని తెలిసినా, గతంలో విమర్శల పాలైన వీఎఫెక్స్ విషయంలో ఈసారి రాజీ పడకూడదని కష్టపడుతున్నా.. మరీ ఇంత టైం తీసుకోవడమేంటి అన్న ప్రశ్నలు మెగా అభిమానుల నుంచి వస్తున్నాయి.
ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం కావడం వల్ల బజ్‌ను కోల్పోయిందని.. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు భారీ విజయాన్ని అందుకున్నాక, వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేస్తే ప్రయోజనం ఉంటుందని.. వేసవి సీజన్‌ను ఎలాగూ వదిలేశారు కాబట్టి జులైలో అయినా సినిమాను రిలీజ్ అయ్యేలా చూడాలని వారు కోరుకుంటున్నారు. ‘పెద్ది’తో క్లాష్ ఇబ్బంది కూడా లేదు కాబట్టి జులై 10నే సినిమాను థియేటర్లకు దించేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on May 11, 2026 8:09 pm
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…