విశ్వక్ సేన్ ప్రతి సినిమాలోను కరకుగా మాట్లాడే మొరటు యువకుడి పాత్రలే చేస్తూ ఒక విధమైన యాంగ్రీ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కుర్రాళ్లలో అతనికి ఫాలోయింగ్ బాగానే వుంది కానీ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అతడి సినిమాలకు అలవాటు పడలేదు. టైప్ కాస్ట్ అయిపోతూ ఒకే మూసలో పడిపోతున్న విశ్వక్ సేన్ రైట్ టైమ్‍లో రైట్ డెసిషన్ తీసుకున్నాడు.
తమిళంలో విజయవంతమయిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఆ చిత్రం లైట్ ఎంటర్‍టైన్‍మెంట్‍తో యూత్‍ని, క్లాస్‍ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా వుంటుంది. తన జీవితం రాంగ్ ట్రాక్‍లోకి వెళ్లిపోయిందని చింతించే ఒక యువకుడు లైఫ్‍లో సెకండ్ చాన్స్ కోరుకుంటాడు. ఈసారి మరో విధంగా జీవితాన్ని బ్రతకాలనుకుంటాడు. కానీ చివరకు తనకు దేవుడు నిర్దేశించినదే అసలైన ఆనందకర జీవితమని తెలుసుకుంటాడు.
ఈ కథను తమిళంలో చాలా వినోదాత్మకంగా తెరకెక్కించడంతో ఆ తమిళ చిత్రం ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. సదరు చిత్రం గురించి మహేష్ బాబు కూడా ప్రత్యేకించి ట్వీట్ చేసాడు. అర్జున్ రెడ్డి ఇమేజ్‍ని బ్రేక్ చేసిన గీత గోవిందం మాదిరిగా విశ్వక్ సేన్‍కి ఈ సినిమా ఇతర వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ దక్కుతుందేమో చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates