రామ్ చరణ్‍కు కరోనా సోకడంతో పధ్నాలుగు రోజుల పాటు క్వారంటైన్‍లో వుండాలి. దీని వల్ల ఆర్.ఆర్.ఆర్. షూటింగ్‍కి మరోసారి బ్రేక్ పడింది. ఆలియా భట్‍తో చరణ్ చేయాల్సిన సన్నివేశాలను రాజమౌళి జనవరి మొదటి వారం నుంచి ప్లాన్ చేసాడు. నిహారిక పెళ్లి పనులతో చరణ్ బిజీగా వున్న టైమ్‍లో ఆలియా హైదరాబాద్‍కి వచ్చి తన సోలో సీన్స్ కోసం పది రోజుల పాటు వర్క్ చేసి వెళ్లింది. హీరో హీరోయిన్ల కాంబినేషన్ సీన్లు జనవరి నుంచి ప్లాన్ చేయగా, చరణ్ రెండు వారాల పాటు అందుబాటులో వుండడు కనుక ఆమె షెడ్యూల్ కూడా ఇప్పుడు వాయిదా వేయాల్సి వుంటుంది.
ఆర్.ఆర్.ఆర్. పూర్తి చేసి తన బాలీవుడ్ కమిట్‍మెంట్స్కి డేట్స్ ఇవ్వాలనుకున్న ఆలియా ప్లాన్స్ ఇప్పుడు అప్‍సెట్ అవుతాయి. చరణ్ వుండడు కనుక ఆర్.ఆర్.ఆర్.కి సంబంధించిన వేరే వర్క్ ముందుకు జరుపుతారో లేక అంతవరకు షూటింగ్ వాయిదా వేస్తారో తెలియదు. కరోనా కారణంగా ఏడెనిమిది నెలలు మూత పడిన చిత్ర పరిశ్రమకు ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులు కరోనా బారిన పడుతూ వుండడం వల్ల అంతరాయాలు తప్పడం లేదు. వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ పలు చిత్రాల షూటింగులకు బ్రేక్స్ పడుతూనే వున్నాయి.
This post was last modified on December 29, 2020 10:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…