తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్ గురించి డిస్కషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవికి దక్కింది పద్దెనిమిది సీట్లే అయినా రెండు దిగ్గజ పార్టీలను ఎదురుకుని ఆ మాత్రం సాధించడం గొప్ప విషయమని అప్పట్లో పత్రికలు రాశాయి. కానీ కొంత కాలానికే పార్టీని ఆపేయడం, కాంగ్రెస్ లో కలిపేయడం నష్టాన్ని చేకూర్చాయి.
ఒకవేళ చిరంజీవి కనక ఇంకొక టర్మ్ ఆగి ఉంటే ఇప్పుడు జనసేన రేపిన ప్రభంజనానికి రెట్టింపు చూసి ఉండేదన్న విశ్లేషణని కొట్టి పారేయలేం. పవన్ కళ్యాణ్ ఆ లోటుని తీరుస్తున్నప్పటికీ కూటమిలో భాగంగా ఉన్నారు తప్పించి సోలో పార్టీగా కాదు. ఇక రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెళ్లిపోయారు. అనారోగ్యం, దూకుడుగా ఉండలేని మనస్తత్వం లాంటి ఎన్నో కారణాలు వెనుకడుగు వేసేలా చేశాయి. ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.
లోక నాయకుడు కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టాక దాన్ని బలపరిచే దిశగా ఎలాంటి అడుగులు వేయలేదు. చివరికి డీఎంకే, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి వెనుక ఉండిపోయారు. చిరు, రజని, కమల్ ముగ్గురిలో ఒక సారూప్యత ఉంది. వీళ్లకు నటతృష్ణ ఎక్కువ. సినిమాలు చేయకుండా ఉండలేరు. స్క్రీన్ మీద కనిపించకూడదని ఏనాడూ కోరుకోలేదు. అందుకే ఖైదీ నెంబర్ 150, రోబో, విక్రమ్ లాంటి కంబ్యాక్ మూవీస్ తో ముగ్గురూ లెగసీ, సీనియారిటీని నిలబెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్, విజయ్ అలా కాదు. సినిమాలు పూర్తిగా వద్దనుకున్నారు. పార్టీ ఫండింగ్ కోసం పవన్ అనన్యమనస్కంగా ఒప్పుకోవడం వల్లే ఆయన స్థాయి కంటెంట్లు దర్శకులు ఇవ్వలేకపోతున్నారు. ఇక విజయ్ జన నాయకుడు తర్వాత మేకప్ వేసుకునే సమస్యే లేదు. పైన చెప్పిన ముగ్గురు దిగ్గజాలు నూటా యాభై, రెండు వందల సినిమాలకు పైగా నటించి యాక్టింగ్ ని ఊపిరిగా మార్చుకున్న వాళ్ళు. అందుకే స్క్రీన్ మీద నెగ్గినా పొలిటికల్ స్క్రీన్ మీద నిలబడలేక తిరిగి సెట్స్ కు వచ్చేశారు.
This post was last modified on May 5, 2026 7:50 pm
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…