Movie News

జననాగయన్‌… తెలుగులోనూ ప్రభంజనమేనా?

పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతూ తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం.. జననాగయన్. ఇది తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అయినప్పటికీ.. విజయ్ ఇమేజ్‌కు, తన రాజకీయ భావజాలానికి తగ్గట్లు మార్పులు చేయడం.. పైగా విజయ్ లాస్ట్ మూవీ కావడంతో తమిళంలో మామూలు హైప్ రాలేదు. ఇదొక సగటు మాస్ మసాలా మూవీనే అయినా.. రూ.500 కోట్ల మేర బిజినెస్ చేసే స్థాయికి చేరుకుంది.

ఈ సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే తమిళ సినిమా రికార్డులన్నీ బద్దలు అయిపోయేవే. కానీ సెన్సార్ సమస్యలు చుట్టుముట్టి ఈ చిత్ర విడుదల ఆగిపోయింది. మధ్యలో సినిమా ఆన్ లైన్లో లీక్ కావడం వల్ల చాలా నష్టమే జరిగింది. కానీ ఈ సినిమాకు ఎదురైన ఇబ్బందుల వల్ల విజయ్ మీద సానుభూతి పెరిగి అంతిమంగా ఎన్నికల్లో అతడికి మంచే జరిగిందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి ఇప్పుడు ఫలితాలు చూస్తే.

విజయ్ ఏకంగా సీఎం అవుతున్నాడు కాబట్టి ‘జననాయగన్’కు అడ్డంకులు తొలగినట్లే. ఈ నెలాఖర్లో ఈ చిత్రం విడుదల కావచ్చని అంటున్నారు.
విజయ్ ఫ్యాన్స్ విజయోత్సాహంలో ఉండగా ‘జననాయగన్’ కానున్న నేపథ్యంలో థియేటర్లలో సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? ఐతే తెలుగు కూడా ఈ చిత్రానికి బంపర్ కలెక్షన్లు వస్తే ఆశ్చర్యమేమీ లేదు.

జనవరిలో ‘జననాయగన్’ తెలుగులో రిలీజై ఉంటే మన జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. అప్పుడు సంక్రాంతికి ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి భారీ చిత్రాల మధ్య పోటీలో రిలీజయ్యేది. దానికి సరిపడా థియేటర్లు దొరికేవి కావు. అన్ని ఆప్షన్లు ఉండగా తెలుగు నుంచి రీమేక్ అయిన తమిళ అనువాద చిత్రాన్ని మన వాళ్లు పట్టించుకునేవారు కాదు.

కానీ ఇప్పుడు విజయ్ సీఎం కాబోతున్న నేపథ్యంలో తన చివరి చిత్రం చూడాలనే ఆసక్తి మన వాళ్లలోనూ ఉంటుంది. పైగా వేసవిలో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సమయంలో ‘జననాయగన్’ రిలీజ్ కాబోతోంది. దీనికి కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. కాబట్టి ఈ చిత్రం సంక్రాంతి టైంలో కంటే ఇప్పుడే ఎక్కువ ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ సినిమా హక్కులు తీసుకున్న వాళ్లు జాక్ పాట్ కొట్టినట్లే.

This post was last modified on May 5, 2026 4:20 pm

Share

Recent Posts

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

12 minutes ago

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌లేదు… లోకేష్ ప‌ట్టించుకున్నారు

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం ఉండే తాడేప‌ల్లి ప్రాంతం.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక మంది పేద‌లు.. దిగువ…

46 minutes ago

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

2 hours ago

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్…

3 hours ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

3 hours ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

3 hours ago