Political News

మళ్లీ ప్రజల్లోకి లోకేష్.. ఈ సారి యువగళాన్నిమించి..!

టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యవర్గం కూడా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టింది. అయితే అత్యంత సెంటిమెంట్‌తో కూడిన కీలక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పదవిని పొందడం, భవిష్యత్ రాజకీయ అధిపతిగా మారనుండడం వంటి అంశాలు నారా లోకేష్‌కు అంత తేలిక కాదనేది స్పష్టమవుతోంది.

ఈ క్రమంలోనే పార్టీలో ఆయనకు మరింతగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పార్టీలో ఇక నెంబర్ 2 స్థానాన్ని నారా లోకేష్ కైవసం చేసుకోనున్నారనేది కూడా వాస్తవం. దీంతో రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాజకీయంగా కావచ్చు, టికెట్ల పరంగా కావచ్చు, ప్రజల కోణంలో చూసుకున్నప్పటికీ ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు నారా లోకేష్‌ను మరింతగా పరిచయం చేయాలన్న ఉద్దేశం ఉంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. అయితే ఈ విషయంపై పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతర్గత చర్చల్లో వస్తున్న అంశాలను గమనిస్తే, గతంలో యువ గళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారో, ఇప్పుడు అటు ప్రజలకు ఇటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు మరింతగా చేరువ కావాలి అన్నది పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి ఇచ్చినప్పటికీ, ఆయనకు అటు పార్టీలో సీనియర్లు, జూనియర్లు సహా అందరూ మరింతగా నారా లోకేష్‌ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అదే విధంగా ప్రజలు కూడా టిడిపి తదుపరి నాయకుడిగా నారా లోకేష్‌ను సొంతం చేసుకోవాలి. భవిష్యత్తు పార్టీ అధినేతగా నారా లోకేష్‌ను ప్రజలు అంగీకరించాలి. ఇప్పటి వరకు మంత్రిగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యువ నాయకుడిగా బలమైన వ్యూహాలు అనుసరించే మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే దీనికి భిన్నంగా, భవిష్యత్తు తరాన్ని, ముఖ్యంగా భవిష్యత్తులో టిడిపిని నడిపించగలిగిన స్థాయిలో నారా లోకేష్ ఎదగాలంటే మరింతగా ప్రజల్లోకి ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే రాబోయే రెండు మాసాల్లో ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ కాలం గడిపేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. తద్వారా లోకేష్‌కు అనుభవంతో పాటు ప్రజలకు చేరువ కావచ్చు అనేది పార్టీ ప్రధాన ఉద్దేశం. తద్వారా లోకేష్‌కు ఇక తిరుగు ఉండదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on May 5, 2026 2:28 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

1 hour ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

4 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

6 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

7 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

7 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

8 hours ago