Movie News

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్ లాంటి చాలా కొద్ది మంది మాత్రమే 80 ఏళ్లు పైబడ్డా సినిమాలు తీస్తుంటారు. ఐతే ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఎవరికీ సాధ్యం కాని విధంగా మన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. ఏకంగా 94 ఏళ్ల వయసులో సినిమా తీసి ఔరా అనిపించారు.

ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వయసులోనూ ఎంతో ఓపికతో కేవలం 4 నెలల్లోనే సినిమా తీసి ఔరా అనిపించారు సింగీతం. పాత తరం దర్శకుడు కదా.. కంటెంట్ అందుకు తగ్గట్లే ఉంటుందేమో అనుకుంటే.. కంటెంపరరీ కథతో ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగే సినిమా తీశారని టీజర్ చూస్తే అర్థమైంది.

‘సింగ్ గీతం’ చిత్రంతో సింగీతం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న దర్శకుల్లో సినిమా తీసిన అతి పెద్ద వయస్కుడు సింగీతమే. ఇప్పటిదాకా ఆ రికార్డు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్‌‌వుడ్ పేరిట ఉంది. ఆయన 2024లో ‘జొరోర్ 2’ సినిమా తీశారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఈస్ట్‌వుడే. ఆ సినిమా తీసే సమయానికి ఆయన వయసు 93 ఏళ్లు.

సింగీతం ఆయన కంటే ఒక సంవత్సరం పెద్ద వయసులో ‘సింగ్ గీతం’ తీశారు. ఐతే మొత్తంగా అత్యంత పెద్ద వయసులో ఫీచర్ ఫిలిం తీసిన ఘనత పోర్చుగీస్ దర్శకుడు మానువల్ డి ఎలోవీరా పేరిట ఉంది. ఆయన 103 ఏళ్ల వయసులో ‘జెబో అండ్ ద షాడో’ అనే సినిమా తీశారు. ఈ సినిమా 2012లో వచ్చింది. ఎలోవీరా ఇంకో మూడేళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో మరణించారు.

ఇప్పుడు జీవించి ఉన్న దర్శకుల్లో అత్యంత పెద్ద వయసులో సినిమా తీసిన ఘనత మాత్రం సింగీతం సొంతం చేసుకున్నారు. మరి ఈ ఉత్సాహంలో సింగీతం ‘సింగ్ గీతం’ తర్వాత కూడా సినిమా తీసి, తన రికార్డును తానే బద్దలు కొడతారేమో చూడాలి.

This post was last modified on May 3, 2026 11:16 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

55 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago