తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని ఎంపిక చేస్తారు? అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? అనే విషయాలు.. సీఎంగా ఆయనకు ఇబ్బందికరంగా మారనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే విని పిస్తోంది. ఇప్పటికి ఒకసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. అయినప్పటికీ.. మరో రెండు సీట్లు ఖాళీ ఉన్నాయి.
దీనికితోడు కీలకమైన హోం శాఖ ముఖ్యమంత్రి చెంతనే ఉంది. దీనిని వేరే వారికి ఇవ్వకతప్పదు. హోం శాఖపై ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు స్టేషన్లు.. అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయని.. హైకోర్టు కొన్నాళ్ల కిందట సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక, బదిలీలు కూడా జరగడం లేదని.. క్షేత్రస్థాయిలో పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ శాఖకు మంత్రిని కేటాయించాల్సిన అవసరం ఉంది.
అలానే లెక్క ప్రకారం ఉండాల్సిన మంత్రుల సంఖ్యలో రెండు ఖాళీ ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఈ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలోనే పార్టీ అధిష్టానం మంత్రివర్గ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ పోటీలో పదుల సంఖ్యలో నాయకులు ఉండడం మరోసారి రేవంత్‌కు ఇబ్బందిగా మారుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే.. వీరిలో ఇద్దరిని ఎంపిక చేసే బాధ్యత సీఎంకే అప్పగించే సూచనలు ఉన్నాయి.
పోటీలో ఉన్నది వీరే..
This post was last modified on May 3, 2026 10:43 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…