Movie News

పెద్ది విధ్వంసానికి ఆకాశ‌మే హ‌ద్దు

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సంద‌డితో ఎంతో ఆశాజన‌కంగా మొద‌లైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ త‌ర్వాత ఎంత వెల‌వెల‌బోయిందో తెలిసిందే. వేస‌విలో ఏవేవో పెద్ద‌, క్రేజీ సినిమాలు వ‌స్తాయ‌ని అనుకుంటే.. వాటిలో చాలా వ‌ర‌కు వాయిదా ప‌డిపోయాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. మొత్తంగా వేసవి సీజ‌న్ స‌రైన సినిమాలు లేక వెల‌వెల‌బోయింది.

వేస‌విలో బిగ్గెస్ట్ సెల‌బ్రేష‌న్ అవుతుంద‌నుకున్న పెద్ది మూవీ ఈ సీజ‌న్‌ను మిస్ చేయ‌డం మెగా అభిమానుల‌నే కాక.. సామాన్య ప్రేక్ష‌కుల‌నూ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఐతే ఏప్రిల్ 30 నుంచి వాయిదా ప‌డ్డ‌ప్ప‌టికీ.. మ‌రీ ఆల‌స్యం చేయ‌కుండా, ఇంకో ఐదు వారాల‌కే సినిమాను రిలీజ్ చేయ‌బోతుండ‌డం అభిమానుల‌కు గొప్ప ఉప‌శ‌మ‌న‌మే. జూన్ తొలి వారంలో ఈ సినిమా ఇండియా వైడ్ బాక్సాఫీస్‌లో వ‌సూళ్ల సునామీ సృష్టించబోతోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఏడాది దురంధ‌ర్ త‌ర్వాత పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ కాగ‌ల స‌త్తా ఉన్న సినిమా పెద్దినే. చికిరి పాట స‌హా ఈ మూవీ ప్రోమోల‌న్నీ పాన్ ఇండియా స్థాయిలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రిలీజ్ టైంకి ఇండియా వైడ్ సినిమాకు మంచి బ‌జ్ క్రియేట్ కావ‌డం ఖాయం.

స‌రిగ్గా ఐపీఎల్ అయిన త‌ర్వాతి వీకెండ్లోనే ఈ సినిమా రిలీజ‌వుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎగ‌బ‌డ‌తార‌న‌డంలో సందేహం లేదు. పైగా ఈ చిత్రాన్ని హిందీలో జియో స్టూడియో రిలీజ్ చేస్తోంది. కాబ‌ట్టి రిలీజ్ ప్లానింగ్, ప్ర‌మోష‌న్లు గ‌ట్టిగానే ఉంటాయి. కావాల్సినంత హైప్ వ‌చ్చేస్తుంది.

ఇక తెలుగులో ఎలాగూ పెద్దికి కావాల్సినంత హైప్ ఉంది. ద‌క్షిణాదిన మిగ‌తా భాష‌ల్లో కూడా సినిమా మీద మంచి అంచ‌నాలే ఉన్నాయి. రిలీజ్ టైమింగ్ ఈ సినిమాకు అత్యంత క‌లిసొచ్చే విష‌యం. పోటీయే లేకుండా రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందే దేశ‌వ్యాప్తంగా పెయిడ్ ప్రిమియ‌ర్స్ కూడా ప‌డుతున్నాయి టాక్తో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ వ‌సూళ్లు సాధించి సోలో హీరోగా రామ్ చ‌ర‌ణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డం లాంఛ‌న‌మే. టాక్ కూడా క‌లిసొస్తే.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఆకాశ‌మే హ‌ద్దు.

This post was last modified on May 2, 2026 12:38 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

18 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago