బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారైను పెళ్లి పేరు చెప్పి రూ.10 కోట్ల మేరకు మోసం చేసినట్లుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది. తన కొడుకును హనీ ట్రాప్ చేసి మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ ఆషు రెడ్డి మీద ధర్మేంద్ర తండ్రి కేసు కూడా పెట్టాడు.
ఆషు రెడ్డికి ధర్మేంద్ర పలుమార్లు డబ్బులు పంపినట్లు ధ్రువీకరించే బ్యాంకు లావాదేవీల తాలూకు స్క్రీన్ షాట్లను కూడా ఆయన పంచుకున్నారు. ఈ ఆరోపణలను ఆషు రెడ్డి జస్ట్ ఖండించి ఊరుకుంది.
తనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఐతే ఈ వ్యవహారంపై ఆషు రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు వార్తలు రాగా.. ఇంకా అలాంటిదేమీ జరగలేదు. ఈలోపు ధర్మేంద్ర ఆరోపణలకు బలం చేకూర్చేలా ఒక ఆడియోను బయటపెట్టారు.
ధర్మేంద్ర నుంచి ఆషు భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆ ఆడియో వింటే స్పష్టం అవుతుంది. అదెంత మొత్తం అని చెప్పలేదు కానీ.. తాను మేలోపు కోటిన్నర రూపాయలు వెనక్కి ఇస్తానని ఆమె చెప్పింది. ఇంటికి వచ్చి గొడవ చేస్తే మాత్రం వేధింపుల కేసు పెడతానని ఆమె హెచ్చరించడం గమనార్హం.
ఆషురెడ్డిదిగా భావిస్తున్న ఈ ఆడియోలో.. ఆమె అవతలి వ్యక్తికి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడింది. తనకు మే వరకు టైమ్ ఇస్తే కోటిన్నర రూపాయలు వెనక్కి ఇస్తానని.. అంతకుమించి ఇవ్వలేనని ఆమె స్పష్టం చేసింది.
మిగతా డబ్బులు కూడా కావాలంటే.. తాను జీవితంలో, కెరీర్లో స్థిరపడి బాగా డబ్బులు సంపాదించే వరకు వెయిట్ చేయాలని చెప్పింది. తాను మిగతా డబ్బులు ఇవ్వను అని చెప్పట్లేదని, అవి కూడా ఇస్తానని.. కానీ అందుకు టైం పడుతుందని ఆమె స్పష్టం చేసింది.
దీనికి ఒప్పుకోకుండా.. తన కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేస్తానంటే.. తన ఇంటికి వస్తానంటే ఒప్పుకోనని ఆమె స్పష్టం చేసింది. తన వైపు నుంచి ప్రవీణ మాత్రమే ఉందని.. ఆమెతో పాటు వేణు స్వామిని కావాలంటే తీసుకురావచ్చని.. అప్పుడు పంచాయితీ పెడదామని ఆమె అంది.
దీనికి ఒప్పుకోకుండా ఇంటికి వచ్చి గొడవ చేస్తానంటే తాను ఊరుకోనని.. తనను వేధిస్తున్నట్లుగా కేసు పెడతానని ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆషురెడ్డి మీద వచ్చిన ఆరోపణలు నిజమే అన్న భావన జనాల్లో కలుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
