Movie News

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి విజువల్ వండర్ చూశాక తన బ్యానర్ లోనూ అలాంటి క్లాసిక్ తీయాలనే సంకల్పంతో నిర్మాత ఎంఎస్ రాజు దేవికి శ్రీకారం చుట్టారు. తన సంస్థకు ఆస్థాన దర్శకుడు, అమ్మోరు సృష్టికర్త కోడి రామకృష్ణకే ఆ బాధ్యతలు అప్పజెప్పారు. టీనేజ్ లో అడుగు పెడుతున్న దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ మీద నమ్మకంతో ఇంత భారీ చిత్రానికి  డెబ్యూ సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చారు.

1999 మార్చ్ 12 విడుదలైన దేవి సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. అప్పటికే పాము బ్యాక్ డ్రాప్ లో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కానీ గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చినవి తక్కువ. దీంతో ప్రేక్షకులు ఎగబడి చూశారు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే కేవలం పాము కాన్సెప్ట్ తో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేంత. కమర్షియల్ గా గొప్ప విజయం అందుకున్న దేవి అందరి కెరీర్లకు మేలిమలుపుగా నిలిచింది. టైటిల్ రోల్ పోషించిన కన్నడ నటి ప్రేమ ఫుల్ డిమాండ్ ఎంజాయ్ చేశారు.

కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత దేవికి కొనసాగింపు ప్లాన్ చేస్తున్నారు ఎంఎస్ రాజు. దేవి 2 వర్కింగ్ టైటిల్ గా పెట్టుకుని స్క్రిప్ట్ పూర్తి చేశారట.  ఒక పాపులర్ హీరోయిన్ ని నటింపజేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కథ ఓకే అయ్యిందని, బడ్జెట్ తదితర వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నాయని వినికిడి. ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేసేలా ప్లానింగ్ ఉంటుందట. అనుష్క అయితే బాగుంటుంది కానీ ఎవరికి సెలక్ట్ చేస్తారో చూడాలి.

ఒకరకంగా దేవి 2 తీయడం రాజుగారికి సవాల్ లాంటిది. ఎందుకంటే కోడి రామకృష్ణ ఇప్పుడు లేరు. విజువల్ ఎఫెక్ట్స్ ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది. ప్రేక్షకులను మెప్పించాలంటే విఎఫ్ఎక్స్ గొప్పగా ఉండాలి. కేవలం టీజర్ లో అవి లేనందువల్లే విశ్వంభర మోక్షం దక్కించుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటోంది. అప్పటి దేవిలో నటించిన క్యాస్టింగ్ అందరూ దాదాపు అందుబాటులోనే ఉన్నారు. మరి రాజు గారి కొత్త దేవి ఎవరో వెయిట్ చేయాలి.

This post was last modified on April 26, 2026 1:34 pm

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

18 minutes ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

5 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 hours ago