Movie News

33 సంవత్సరాల తర్వాత కల్ట్ సీక్వెల్

సంజయ్ దత్ హీరోగా ఎన్ని సినిమాలు చేసినా తనకో స్టార్ స్టేటస్ తీసుకొచ్చి మార్కెట్ ని పెంచిన బ్లాక్ బస్టర్ ముమ్మాటికీ ఖల్ నాయక్ ఒక్కటే. 1993లో రిలీజైన ఈ యాక్షన్ డ్రామా ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ అప్పటిదాకా పరిశ్రమ చూడని ఒక కొత్త ట్రెండ్ దీని ద్వారానే సృష్టించారు. ముఖ్యంగా చోళీ కే పీచే క్యా హై పాట యావత్ ప్రేక్షకులను ఊపేసింది. పేరుకి జాకీ శ్రోఫ్ హీరోగా కనిపించినా ఖల్ నాయక్ పూర్తిగా సంజయ్ దత్ వన్ మ్యాన్ షో.

ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కల్ట్ మూవీకి సీక్వెల్ రాబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తిరిగి సంజయ్ దత్తే తన పాత్రను వయసు మళ్ళిన తర్వాత పోషించబోతున్నారు. నిన్న చిన్న వీడియో టీజర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. పొడవాటి జుత్తుతో ఈ వయసులో కూడా సంజయ్ దత్ లుక్స్ చూస్తుంటే మూవీ లవర్స్ వావ్ అనుకోకుండా ఉండలేరు. ఈసారి దురంధర్ తో రికార్డులు తిరగరాసిన జియో స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండనుంది.

వినడానికి బాగానే ఉంది కానీ మూడు దశాబ్దాల తర్వాత ఖల్ నాయక్ కంటిన్యుయేషన్ అంటే సాహసమే. ఎందుకంటే ఈ సినిమాతో కనెక్షన్ తొంభై దశకం చిన్న పిల్లలు, టీనేజ్, యూత్, మధ్యవయస్కులకు మాత్రమే ఉంది. ఇప్పటి జెన్ జీ కిడ్స్ కి దీని గురించి అవగాహన తక్కువ. అయినా సరే రిస్క్ కు సిద్ధపడటం చూస్తుంటే కంటెంట్ ఏదో స్ట్రాంగ్ గానే రాసుకున్నట్టు ఉన్నారు. క్యాస్టింగ్, ఇతర టెక్నికల్ వివరాలు పొందుపరచకుండా జాగ్రత్త పడ్డారు.

ఒకవేళ ఖల్ నాయక్ రిటర్న్స్ కనక హిట్ అయితే ఇలా పాత క్లాసిక్స్ ని మళ్ళీ కొనసాగింపు చేసే ట్రెండ్ మొదలవుతుంది. అయినా ఇదేమి కొత్త కాదు. డాన్ 2 అలా ట్రై చేసిందే. షోలేని కూడా ఇలాగే పార్ట్ 2 చేద్దామని కొందరు రమేష్ సిప్పిని అడిగారు కానీ ఆయన ఒప్పుకోలేదని ముంబై టాక్.

పాత ఖల్ నాయక్ లో నటించిన మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, రమ్యకృష్ణ, నీనా గుప్తా అందరూ అందుబాటులోనే ఉన్నారు. వీళ్ళందరూ రెండో భాగంలో ఉంటారో లేదో వేచి చూడాలి. ఈ సీక్వెల్ బాధ్యతలు సంజయ్ దత్, అక్ష కంబోజ్ సంయుక్తంగా నిర్వహించనుండగా దర్శకత్వం ఎవరు చేస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.

This post was last modified on April 25, 2026 11:51 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

1 hour ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago