తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. మాజీ సీఎం కేసీఆర్ తనయ.. కవిత పార్టీ పేరును ప్రకటించారు. `తెలంగాణ రాష్ట్ర సేన`(టీఆర్ ఎస్)గా ఆమె తన పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌లోని మునీరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కవిత సొంత పార్టీ పేరును ప్రకటించారు. తొలుత ఆమె హైదరాబాద్ నుంచి ప్రత్యేక ర్యాలీగా మునీరాబాద్ చేరుకున్నారు. అనంతరం.. ఇక్కడి ఓ కన్వెన్షన్ హాల్‌లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు.
జీవితంలోనే ప్రత్యేకం..
పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. అనేది తన జీవితంలో ప్రత్యేకమని కవిత పేర్కొన్నారు. గత ఉద్యమంలో తాను పోషించిన పాత్ర, జాగృతి పాత్రను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. జాగృతి ని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళలు ఎంతో సహకరించారని తెలిపారు. బతుకమ్మ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లి.. ఉద్యమంలో కీలక పాత్ర పోషించామన్నారు. ఏ ఉద్యమానికైనా శక్తులు ఉంటాయని.. తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక పునాది వేసిన ఘనత జాగృతిదేనని పేర్కొన్నారు.
దీనికి ముందు..
టీఆర్ ఎస్ పార్టీ ప్రకటనకు ముందు.. హైదరాబాద్‌లోని జాగృతి నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత భర్త, తర్వాత కుమారుడు కవితకు విషెస్ చెప్పారు. అనంతరం గన్ పార్కు దగ్గర తెలంగాణ అమరవీరులకు కవిత నివాళులర్పించారు.
అక్కడి నుంచి 25-30 కార్ల కాన్వాయ్‌తో మేడ్చల్‌కు చేరుకున్నారు. ఈ మధ్యలో పలు చోట్ల కవిత కాన్యాయ్‌కు మహిళలకు స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో కారుదిగి పార్టీ అభిమానులను ఆమె పలకరించారు. సభకు రావాలని ఆహ్వానించారు. సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లే చేశారు.
పార్టీ జెండా ఇదీ..
పసుపు వర్ణంతో కూడిన పతాకం.. మధ్యలో నీలం వర్ణంలో తెలంగాణ రాష్ట్రం మ్యాప్ ఉంది. గతంలో బీఆర్ ఎస్ పార్టీ జెండా కూడా.. గులాబీ రంగులో ఉండి.. మధ్యలో తెలంగాణరాష్ట్ర మ్యాప్ ఉండడం గమనార్హం.
ఈ పార్టీ పేరుతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడినట్లయింది. TRS పేరుకు తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్న కేసీఆర్ కు కవిత పెద్ద షాక్ ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా TRS అని మార్చుకుంటే ప్రజల్లో కన్ఫ్యూషన్ తప్పదని తెలుస్తోంది.
This post was last modified on April 25, 2026 12:13 pm
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…