టాలీవుడ్లో ఒకప్పుడు రీమేక్‌లకు పెట్టింది పేరు సీనియర్ హీరో రాజశేఖర్. మొరటోడు నా మొగుడు, సూర్యుడు, బలరామ కృష్ణులు, సింహరాశి, విలన్, సత్యమేవ జయతే, గడ్డం గ్యాంగ్, శేఖర్.. ఇలా లెక్కలేనన్ని రీమేక్ సినిమాలు చేశారాయన. అందులో కొన్ని విజయవంతం అయ్యాయి. కొన్ని ఫెయిలయ్యాయి. ఐతే రాజశేఖర్ తాను మిస్సయిన ఓ రీమేక్ గురించి తరచుగా బాధ పడుతూ ఉంటారు. అదే.. ఠాగూర్.
తమిళంలో విజయ్ కాంత్ హీరోగా మురుగదాస్ రూపొందించిన రమణ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ముందు ఈ సినిమా రీమేక్ హక్కులను తీసుకుంది రాజశేఖరే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేతికి వెళ్లిపోయింది. మరి మధ్యలో ఏం జరిగిందన్నది సస్పెన్స్. ఇటీవలే బైకర్ మూవీలో ప్రత్యేక పాత్రలో పలకరించిన రాజశేఖర్.. ఒక ఇంటర్వ్యూలో ఠాగూర్ రీమేక్ విషయంలో తెర వెనుక ఏం జరిగిందో వెల్లడించారు.
రమణ రీమేక్ హక్కులను ముందు కొనుగోలు చేసింది తానే అని రాజశేఖర్ తెలిపారు. ఆ చిత్ర నిర్మాత తన స్నేహితుడే కావడంతో హక్కులు తీసుకున్నానని, ఐతే రైట్స్ గురించి నోటి మాటగా అనుకున్నామే తప్ప, అగ్రిమెంట్ చేసుకోలేదని రాజశేఖర్ తెలిపారు. ఐతే ఈలోపు ఠాగూర్ మధు.. చిరంజీవి గారి కోసం ఆ సినిమా హక్కులు తీసుకోవాలని అనుకున్నారని.. ఆయన ఆ నిర్మాతను కలిసి ఎక్కువ రేటు ఆఫర్ చేశారని.. ఆయన టెంప్ట్ అయి రైట్స్ ఇచ్చేశారని రాజశేఖర్ తెలిపారు.
లిఖిత పూర్వక ఒప్పందం లేకపోవడం వల్ల తాను ఆ విషయంలో ఏమీ చేయలేకపోయానని.. అలా ఠాగూర్ సినిమా తన చేజారిందని రాజశేఖర్ వెల్లడించారు. గతంలో చిన్నతంబి రీమేక్ చంటి విషయంలో కూడా ఇలాంటి వివాదమే నడిచింది. ముందు రాజేంద్రప్రసాద్ ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఆ సినిమా వెంకటేష్ చేతికి వెళ్లిపోయింది. దీనిపై రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆవేదనతో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు.
This post was last modified on April 24, 2026 11:50 pm
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…