Movie News

ఒడిస్సి జోరు ఎక్కడి దాకా వచ్చింది

హాలీవుడ్ మూవీ ది ఒడిస్సి ఇండియాలో వంద కోట్ల మార్కు అందుకోవడం చిన్న రికార్డు కాదు. సూపర్ హీరోస్, ప్రమాదకర జంతువులు, ఫాంటసీ ఎలిమెంట్స్ ఏవీ లేని ఒక సర్వైవల్ డ్రామా ఇంత మొత్తం రాబట్టడం గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా విఎఫెక్స్ వాడకం పరిమితంగా ఉన్న ఈ మూవీలో డ్రామా ఎంత ఉన్నప్పటికీ గూస్ బంప్స్ ఇచ్చే అంశాలు తక్కువే. అయినా సరే ఇంత గొప్ప విజయం సాధించడం దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ కే సాధ్యం.

వీక్ డేస్ లోనూ ఒడిస్సి రన్ డీసెంట్ గా ఉంది. ఆక్యుపెన్సీలు మరీ దారుణంగా పడిపోకపోవడం శుభ సూచకం. ఇంగ్లీష్ వెర్షన్ బాగా ఆడుతున్న నగరాల్లో కొచ్చి తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. బుధవారం దేశవ్యాప్తంగా 8268 షోలు వేయగా డబ్బింగ్ చేయని ఒరిజినల్ వెర్షన్ ఒక్కటే 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడం విశేషం. నైట్ షోలలో 70 శాతానికి పైగానే క్రౌడ్స్ కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ లో తక్కువ స్పందన ఉంది.

థియేటర్ రన్ అయ్యేలోపు 150 కోట్లు దాటాలని చూస్తున్న నిర్మాతలకు జూలై 30 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రూపంలో పెద్ద అడ్డంకి రానుంది. దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, కుటుంబాలు దాని వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు కాబట్టి ఒడిస్సి ఫైనల్ రన్ కు వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలా జరిగే పక్షంలో రాబోయే వీకెండ్ నోలన్ మూవీకి అంతగా వర్కౌట్ కాదు. ఏపీ తెలంగాణ రెండో వారంలో కూడా తగినన్ని స్క్రీన్లు ఒడిస్సికి కేటాయించారు.

బాలీవుడ్ లో ఢమాల్ 4 తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఈ వారం విజయ్ జన నేత తప్ప వేరే ఆప్షన్లు అంతగా కనిపించడం లేదు. ఉత్తరాది మార్కెట్లలో ఒడిస్సికి ఈ అంశం బాగా కలిసి వస్తోంది. పాజిటివ్ నెగటివ్ రెండు రకాల టాక్స్ మిశ్రమంగా తెచ్చుకున్నప్పటికీ ఈ స్థాయిలో ఒడిస్సి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటిదాకా కంటెంట్ సినిమాలు తీస్తూ వచ్చిన క్రిస్టఫర్ నోలన్ నెక్స్ట్ ఒక హారర్ మూవీ తీయొచ్చని వినిపిస్తోంది. కథ ఇంకా రాసుకోవాలట.

This post was last modified on July 23, 2026 12:47 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

15 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago