Movie News

అసాధ్యం అనుకున్నది ప్రభాస్ చేయగలరా

టాలీవుడ్ స్టార్ హీరో ఎవరైనా సరే ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమనేది కలగా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ చేసి చూపించారు కానీ దానికి కారణాలు వేరు. హరిహర వీరమల్లు, ఓజి షూటింగుల్లో జరిగిన విపరీతమైన జాప్యం వల్ల వాటికి ఉస్తాద్ భగత్ సింగ్ కు తక్కువ గ్యాప్ వచ్చింది కానీ, ముందుగా అనుకుని చేసినవి కాదు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరస తెలిసిందే. రెండేళ్లు మినిమమ్ టైంగా మారిపోయింది. దానికి తోడు రిలీజుల వాయిదాలు. అయితే ప్రభాస్ వీళ్లకు భిన్నమైన వేగంతో వెళ్లడం ప్రత్యేకంగా గమనించాలి.

డిసెంబర్ 3 ఫౌజీ రాకలో ఎలాంటి అనుమానం లేదు. కన్ఫర్మ్ అయిపోయింది. టైం తక్కువగా ఉన్నప్పటికీ దర్శకుడు హను రాఘవపూడి రెండు యూనిట్లతో పని చేయిస్తున్నారు. మైత్రి టీమ్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా బ్రేక్ రాకుండా చూసుకుంటోంది. బాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్ పరంగా అన్నింటికి అదే అనువైన తేదీ కావడంతో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకునే ఉద్దేశంలో లేరు.

ఇది జరిగిన మూడు నెలలకు మార్చిలో స్పిరిట్ వచ్చేయాలి. ఇప్పటికే నలభై శాతం పూర్తి చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్కువ లొకేషన్స్, విఎఫ్ఎక్స్ హడావిడి లేకుండా యానిమల్ తరహాలో చాలా ఆర్గానిక్ గా తీస్తున్నారట. అందుకే వేగంగా అవుతోందని టాక్. ఇది కూడా డెడ్ లైన్ వదిలే ప్రసక్తే లేదనే తరహాలో పరుగులు పెడుతోంది. డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అందరితో చర్చించాకే ప్యాన్ ఇండియా కోణంలో బెస్ట్ డేట్ అవుతుందని భావించి మార్చ్ 5 లాక్ చేసుకున్నారు.

అంటే కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ప్రభాస్ నుంచి వచ్చినట్టు అవుతుంది. అంతేకాదు రాజా సాబ్ నుంచి చూసుకుంటే పదమూడు నెలల కాలంలో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ఇవ్వడం, ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు సాధ్యం కావడం మిగిలిన వాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. తర్వాత కల్కి 2, సలార్ 2 లైన్ లో పెట్టిన ప్రభాస్ ఇవి కాకుండా ఇంకెవరికి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. పలువురు దర్శకులు ప్రయత్నాల్లో ఉన్నారు కానీ ఇంకా ఫైనల్ కాలేదు.

This post was last modified on July 23, 2026 10:38 am

Share

Recent Posts

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

22 minutes ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

39 minutes ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

55 minutes ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

2 hours ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

2 hours ago

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

4 hours ago