అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రం దర్శకుడు అనురాగ్ బసు డైరెక్షన్లో జరగనున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీని ముంబై వర్గాలు ఆషీకీ 3గా పిలుచుకుంటున్నాయి. అయితే ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా టీమ్ సైలెంట్ ఉంది. నిజానికిది గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది.
ట్విస్టు ఏంటంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటిదాకా కేవలం నలభై రోజులు మాత్రమే అయ్యిందట. అంటే సగం కూడా లేదన్న మాట. అలాంటప్పుడు రిలీజ్ గురించి ఇంతకు ముందు వార్తలు ఎలా వచ్చాయంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ స్క్రిప్ట్ పనిలో ఉన్న అనురాగ్ బసు మరి కార్తీక్ శ్రీలీల ప్రాజెక్టుని పక్కన పెట్టారా లేక ఆర్థిక కారణాల వల్ల ఏమైనా వాయిదా పడిందా అనేది తెలియడం లేదు.
ప్రస్తుతానికి దీని గురించి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. అనురాగ్ బసు మాత్రం ఇది చేస్తాననే తరహాలో మాట్లాడుతున్నారు కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ఏదో ఉందంటూ నార్త్ మీడియా వర్గాలు కథనాలు వడ్డించాయి. దానికి తగ్గట్టే శ్రీలీల వాళ్ళ ఇంటికి వెళ్లినట్టుగా వచ్చిన లీక్స్ వాటికి బలాన్ని చేకూర్చాయి. తర్వాత అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలని తేలిపోవడం వేరే విషయం.
అర్జెంట్ గా శ్రీలీలకో హిట్టు కావాలి. ఎవరితో నటించినా ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంటే అదేమో పిడికెడు కూడా తీర్చలేదు. తమిళంలో పరాశక్తి తనకు ఆఫర్ల వర్షం కురిపిస్తుందనుకుంటే శివ కార్తికేయన్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాపుగా నిలిచింది. అంతకు ముందు శ్రీలీల ట్రాక్ రికార్డు తెలిసిందే. మరి కార్తీక్ ఆర్యన్ తో చేసిన హిందీ తెరంగేట్రం గురించి ఎప్పుడు చెబుతుందో చూడాలి.
This post was last modified on April 22, 2026 11:29 pm
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…