Movie News

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా ఇండియా వైడ్ మల్టీప్లెక్సులన్నీ కలిపి లక్ష దాకా టికెట్లు అమ్మినట్టు ట్రేడ్ సమాచారం. డబ్బింగ్ వెర్షన్లు లేకుండా కేవలం ఇంగ్లీష్ లోనే రిలీజ్ చేస్తున్నా ఇంత భారీ స్పందన రావడం చూస్తే ఎవరికీ నోటమాట రావడం లేదు. రేపు రాత్రి హైదరాబాద్ లో వేస్తున్న ప్రీమియర్లు దాదాపు హౌస్ ఫుల్ అయ్యాయంటే క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు .

నిజానికి మైఖేల్ జాక్సన్ ని బ్రతికి ఉన్నప్పుడు చూసిన జనరేషన్ కాదిది. ఎందుకంటే ఆయన 2009లోనే చనిపోయారు. పోయేనాటికి వయసు 50 సంవత్సరాలే. అయినా సరే తన డాన్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన తీరు కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టింది. చిన్నప్పటి నుంచే కష్టాల్లో పుట్టి పెరిగి ఒక స్టీల్ ఫ్యాక్టరీ వర్కర్ చివరి సంతానంగా జన్మించిన ఈ ఐకాన్ జీవితంలో ఎన్నో వెలుగు చీకట్లు ఉన్నాయి. అవన్నీ బయోపిక్ లో ఉంటాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ప్రభుదేవా, చిరంజీవి లాంటి ఎందరికో మైఖేల్ జాక్సన్ స్ఫూర్తి ప్రదాత. దొంగలో గోలీమార్ సాంగ్, ప్రేమికుడులో ముక్కాలా ముక్కాబులా పాట లకు పూర్తి ఇన్స్ పిరేషన్ ఆయనే. అలాంటి లెజెండరీ పర్సనాలిటీని స్క్రీన్ మీద చూసేందుకు జెన్ జీ కిడ్స్ ఇంత ఆసక్తి చూపించడం విశేషం. యుఎస్ ప్రీమియర్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కొన్ని కామెంట్స్ మిశ్రమంగా, నెగటివ్ గానూ ఉన్నాయి కానీ ఇక్కడ షో పడితే తప్ప క్లారిటీ రాదు.

ఇదంతా ఎలా ఉన్నా భారతీయ సినీ ప్రియుల అభిమానం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. మైఖేల్ జాక్సన్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఎంతలేదన్నా వారం రోజులు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. ఒరిజినల్ ఫీల్ పోకూడదనే ఉద్దేశంతోనే వేరే ఏ భాషలో డబ్బింగ్ చేయలేదని, సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదని మేకర్స్ భావిస్తున్నారు. ఇంత క్రేజీ ఎంటర్ టైనర్ కేవలం 2 గంటల 7 నిమిషాల నిడివి ఉండటం విశేషం.

This post was last modified on April 23, 2026 6:37 am

Share

Recent Posts

విశ్వదాభిరామా… వినవయ్యా విశ్వంభరా

చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…

5 minutes ago

ఇండోనేషియాలో నౌక గల్లంతు

ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…

11 minutes ago

వినాయక చవితి పూజా విధానం 2026

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…

1 hour ago

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

3 hours ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

4 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

5 hours ago