ఇటీవలే టోవినో థామస్ ‘పళ్ళి చట్టంబి’ తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్ ఫలితం అందుకుంది. అసలిది రిలీజైన విషయమే సగటు ప్రేక్షకులకు తెలియదంటే ఆశ్చర్యం లేదు. గతంలో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ పేరు మార్చకుండా ఒరిజినల్ టైటిల్ తో యథాతథంగా తీసుకొచ్చారు. తీరా చూస్తే కంటెంట్ బాగానే ఉన్నా కూడా ఆడియన్స్ కి చేరలేదు. కారణం సింపుల్. జనాలకు సదరు అరవ పేరు రిజిస్టర్ కాకపోవడమే.
రజనీకాంత్ ‘వెట్టయన్’కు ఈ తిప్పలు తప్పలేదు. ఇప్పటికీ కొందరు టాలీవుడ్ ఆడియన్స్ ఈ పేరుని వెంటనే గుర్తుపట్టలేరు. కావాలంటే ట్రై చేసి చూడండి. విక్రమ్ ‘తంగలాన్’ అంటే ఏంటో అర్థం కాక థియేటర్ కు వెళ్లడం మానుకున్న వాళ్ళు ఉన్నారు. అజిత్ ‘వలిమై’ని అభిమానులు తప్ప ఏపీ తెలంగాణలో చూసిన పబ్లిక్ తక్కువే. కారణం చెప్పనక్కర్లేదు. సూర్య కంగువ, ధనుష్ రాయన్, లారెన్స్ జిగర్ తండ డబుల్ ఎక్స్, మోహన్ లాల్ ఎంపురాన్ ఇవన్నీ ఒకే బాపతే. కంటెంట్స్ కొన్ని బాగుంటే కొన్ని బాలేవు.
అయినా సరే ప్రేక్షకులను చేరడంలో ఫెయిలయ్యాయి. ప్యాన్ ఇండియా పేరుతో అన్ని భాషలు ఒకటే అన్న సిద్ధాంతంతో ఇలా తమిళ మలయాళ టైటిల్స్ ని రుద్దడం వల్ల ఫైనల్ గా నష్టపోతున్నది నిర్మాతలే. ఒకప్పుడు కాదలన్ అంటే ప్రేమికుడు అని పెట్టేవాళ్ళు. ఆన్బే శివమ్ అంటే సత్యం శివమ్, మిన్సార్ కనవు అంటే మెరుపు కలలు, ఇరువర్ అంటే ఇద్దరు అని స్వచ్ఛమైన తెలుగు పేర్లను అనువాదాలకు చూసేవాళ్ళం. ఇప్పుడు అంత ఓపిక ఉండటం లేదు.
లేదూ మేము మారము ఇలాగే కొనసాగిస్తామంటే ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. ఎందుకంటే తాజాగా విడుదల కాబోతున్న వాలా 2 కూడా మళయాలం టైటిలే. అసలు 1 లేకుండా ఇప్పుడీ 2 ఎందుకు వస్తోందంటే ఒరిజినల్ వెర్షన్ బ్లాక్ బస్టర్ కావడం వల్లే. ఇక్కడా ఆడుతుందన్న నమ్మకం నిర్మాతలో ఉండొచ్చు కానీ బుకింగ్స్ అయితే అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అయినా ఎవరో ఒకరు పూనుకుని ఇలా అర్థం కాని టైటిల్స్ ప్రహసనానికి బ్రేక్ వేస్తే బెటర్.
This post was last modified on April 22, 2026 11:27 pm
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న దాదా డిసెంబర్ 24 నుంచి వాయిదా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ 'అక్క' స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి…
ఒకపక్క నలభై దాటని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి, ఒకవేళ అది ఫ్లాప్ అయితే దాని గురించి…
ఔను అంటున్నారు అనంతపురం ప్రజలు. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 కార్పొరేషన్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకుంది. ఒక్క…
మావిగన్.. (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు నగరాలతో కూడిన రాజధాని) జగన్ చేసిన ఈ ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందే!. దీనినే తమ…