ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ – గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆవిడ స్థానంలో కాజల్ అగర్వాల్ ని దాదాపు లాక్ చేశారనే వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. బాలయ్య, కాజల్ గతంలో భగవంత్ కేసరి చేశారు కానీ అందులో లవ్ ట్రాక్, డ్యూయెట్స్ లాంటివి ఏమీ లేవు. ఇంతకీ నయన్ ఎందుకు తప్పుకుందనే సందేహం రావడం సహజం.
ఎన్బికె 111గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుకు ముందు అనుకున్న కథ వేరేనన్న సంగతి విదితమే. బాలయ్య డ్యూయల్ రోల్, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ మలినేని చాలా పవర్ ఫుల్ సబ్జెక్టు రాసుకున్నాడు. బడ్జెట్ కూడా భారీగా డిమాండ్ చేసే స్క్రిప్ట్ అది. దానికి తగ్గట్టే శక్తివంతమైన మహారాణి పాత్రకు నయనతారను ఒప్పించారు. రెమ్యునరేషన్ ఎక్కువ అయినా సరే ఓకే అనుకున్నారు. తర్వాత ఏకంగా స్టోరీ మారిపోవడంతో నయన్ క్యారెక్టర్ ప్రాధాన్యం తగ్గింది.
అలాంటప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే వర్కౌట్ కాదు. మన శంకరవరప్రసాద్ గారులో ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే అనిల్ రావిపూడి రిస్క్ తీసుకున్నాడు. ఫలితంగా బాగా వచ్చింది. కానీ ఇప్పుడు బాలయ్య చేస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీలో ఆ స్కోప్ లేదట. దీంతో కాజల్ అగర్వాల్ ని రీ ప్లేస్ చేశారని వినికిడి. పైగా నయన్ ముందు ఇచ్చిన డేట్స్ వృథా అయిపోవడంతో పాటు సల్మాన్ ఖాన్ మూవీకి కమిట్ కావడం ఫైనల్ గా ఈ పరిణామాలకు దారి తీసింది.
సింహ, శ్రీరామ రాజ్యం, జై సింహ తర్వాత ముచ్చటగా నాలుగోసారి బాలయ్య, నయన్ జంటను చూడాలనుకున్న ఫ్యాన్స్ కి ఇది కొంచెం నిరాశ కలిగించే వార్తే. ప్రస్తుతం టీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. పెద్ది తీస్తున్న నిర్మాణ సంస్థ కావడంతో ముందు ఇది విడుదలయ్యాకే బాలయ్య మూవీ వార్తలు బయటికి రాబోతున్నాయి. ఇదే ఏడాది దసరా లేక దీపావళి విడుదలకు ట్రై చేస్తున్నారు కానీ ఒకవేళ సాధ్యం కాకపోతే 2027 బరిలో ఎన్బికె 111 ఉంటుంది.
This post was last modified on April 22, 2026 11:19 am
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…