తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యే పునఃప్రారంభం అయ్యాయి థియేటర్లు. ఐతే మొదట్లో అవి నామమాత్రంగానే నడిచాయి. ప్రేక్షకులు ఏమీ పట్టనట్లే ఉన్నారు. కొత్త సినిమాలు వస్తే వెళ్దామని వాళ్లు.. ప్రేక్షకులొస్తే కొత్త సినిమాలు వదులుదామని నిర్మాతలు చూశారు. మొత్తానికి క్రిస్మస్ సీజన్లో రెండు వైపులా కదలిక వచ్చింది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి అంచనాలకు మించి స్పందన వచ్చింది. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి.
సినిమాకు టాక్ గొప్పగా ఏమీ లేకున్నా వీకెండ్లో థియేటర్లు బాగానే నిండుతున్నాయి. మంచి వసూళ్లే వస్తున్నాయి. ఈ సినిమాతో థియేటర్లలో మళ్లీ సందడి నెలకొనడం చూశాక వెంటనే ఇండస్ట్రీ జనాలు అలెర్టయిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గత మూణ్నాలుగు రోజుల్లోనే మూడు సినిమాలను సంక్రాంతికి ఖరారు చేశారు. రిలీజ్ డేట్లు కూడా ఇచ్చేశారు.
ముందుగా రవితేజ సినిమా క్రాక్ జనవరి 14కు ఖరారు కాగా.. తర్వాత రామ్ రెడ్ చిత్రాన్ని అదే తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అల్లుడు అదుర్స్ సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఇప్పటిదాకా ఈ సినిమా సంక్రాంతికి వస్తుందన్న సంకేతాలే లేవు. కానీ నేరుగా జనవరి 15న విడుదల అని అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. సంక్రాంతికే అనుకున్న అరణ్య, రంగ్‌దె సినిమాల సంగతేంటో తెలియదు. ప్రస్తుతానికి అవి రేసులో లేనట్లే. మరోవైపు తమిళ డబ్బింగ్ మూవీ మాస్టర్ సైతం సంక్రాంతికే రాబోతోంది. జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. అంటే ఎప్పట్లాగే వచ్చే సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు పోటీపడతాయన్నమాట.
ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని సినిమాలు ఆడేంత సీన్ ఉందా అన్నది డౌట్. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సంగతి వేరు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లో దాన్నే ఆడిస్తున్నారు. మామూలుగా తేజు సినిమా రిలీజయ్యే సంఖ్యతో పోలిస్తే ఎక్కువ థియేటర్లలో రిలీజవడం వల్ల వసూళ్లు బాగున్నాయి. కానీ సంక్రాంతికి నాలుగు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేస్తే.. ఒక్కోదానికి దక్కే స్క్రీన్లు, షోలు తక్కువ. పైగా 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాలి. అంటే హౌస్ ఫుల్ అయితే వచ్చే రెవెన్యూలో సగమే వస్తుంది. టాక్ అటు ఇటుగా ఉంటే అంతే సంగతులు. ఇంతకుముందులా వీకెండ్ రికవరీ అంత తేలిక కాదు. తక్కువ షేర్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. హిట్ టాక్ వచ్చినా కూడా ఇంత పోటీలో, 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో వచ్చే షేర్ మరీ ఎక్కువేమీ ఉండదు. మరి ఈ రిస్క్ గురించి నిర్మాతలు ఆలోచిస్తున్నారా?
This post was last modified on December 28, 2020 12:33 pm
ఏపీ సర్కారు తరఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్లు దావోస్‌లో పెట్టుబడులు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో…
ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గేమ్ చేంజర్’ మూవీ.. రిలీజై ఒక్క రోజు తిరక్కముందే ఆన్ లైన్లోకి…
పుష్ప-2 ఇంకా థియేటర్లలోనే ఉంది. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప-3’ తీయడానికి సినిమాలో చిన్న హింట్ అయితే ఇచ్చారు కానీ.. ఆ…
నిజమే… తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు అందరికీ ఆదర్శమని చెప్పాలి. ఎందుకంటే.. పార్టీలు వేరైనా… తమ జిల్లా…
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు పూర్తి చేసుకుని మరో బ్లాస్టింగ్ మూవీ కోసం రెడీ అవుతున్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను…
సోషల్ మీడియాలో ఏదైనా పుకారు మొదలైందంటే క్షణాల్లో ఊరువాడా దాటేసి ప్రపంచం మొత్తానికి చేరిపోతోంది. అది నిజమో కాదో అర్థం…