ఓటీటీలు సొంతంగా సినిమాలు తీస్తాయి.. వెబ్ సిరీస్‌లను నిర్మిస్తాయి. ఐతే 100 పర్సంట్ తెలుగు కంటెంట్ మాత్రమే ఇస్తున్న అల్లు వారి ఓటీటీ.. మామూలుగా టీవీల్లో చూసే టాక్ షోలను ప్లాన్ చేసింది. కమెడియన్ హర్షతో ఇప్పటికే ఒక టాక్ షోను నడిపిస్తున్న ఆ ఓటీటీ.. ఇటీవలే సమంత హోస్ట్‌గా సామ్ జామ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, తమన్నా, రకుల్, క్రిష్, చిరంజీవి లాంటి అతిథులు వచ్చి ఈ షోలో సందడి చేశారు. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న చిరంజీవి ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీని తర్వాత మరో ఆకర్షణీయమైన ఎపిసోడ్ ప్లాన్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి ఎపిసోడ్‌లో గెస్ట్‌గా కనిపించనున్నారు.
తాజాగా బన్నీ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను వదిలారు. మా డాడీ మీ షోకు వస్తే ఓ ప్రశ్న అడుగుతారా అని సమంతకు బన్నీ కొడుకు అయాన్ ఫోన్ చేసి అడగడంతో ఈ ప్రోమో మొదలవడం విశేషం. తర్వాత బన్నీ రంగంలోకి దిగాడు. మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అని ఎందుకంటారో తెలుసా.. మీరు ఈ ఏడాది మోస్ట్ గూగుల్డ్ తెలుగు స్టార్ కదా అంటూ బన్నీకి సమంత ప్రశ్నలు సంధించింది. అలాగే మీకు అత్యంత నచ్చిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నతో ఇరుకున పెట్టింది సామ్.
అభిమానుల గురించి అడిగినపుడు.. తల్లిదండ్రులు ఎలా షరతుల్లేకుండా ప్రేమిస్తారో.. అభిమానులు కూడా అంతే అంటూ వారిని ఆకాశానికెత్తేశాడు బన్నీ. ఈ ఎపిసోడ్‌లో బన్నీకి తోడు మరో వ్యక్తి కూడా సందడి చేశారు. ఆయనెవరో కాదు.. బన్నీ తండ్రి, ఆహా అధినేత అల్లు అరవింద్.
తన ఓటీటీకి హైప్ తేవడానికి బన్నీని రప్పించడమే కాక.. స్వయంగా అరవిందే రంగంలోకి దిగడం విశేషమే. ప్రోమో చూస్తే ఈ ఎపిసోడ్ బాగానే హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. నూతన సంవత్సర కానుకగా బన్నీ ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది.
This post was last modified on December 28, 2020 8:07 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…