ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో పరిశ్రమ మనుగడకు అవసరమైన నిర్ణయాలను కలిసికట్టుగా తీసుకునేందుకు దసపల్లా హోటల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కొన్ని విధి విధానాలను మాట్లాడకున్నాయి. దానికి సంబంధించిన ప్రాధమిక వివరాలను ఒక ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఓటిటి విండో.
కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో ఎనిమిది వారాల ఓటిటి గ్యాప్ ని తప్పనిసరి చేయాలంటూ పలువురు నిర్మాతలు సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్టుగా వచ్చిన వార్త ఇతర ప్రొడ్యూసర్లను కలవరానికి గురి చేసింది. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలు ఇంత సుదీర్ఘమైన గ్యాప్ ఇస్తే ఓటిటిలు తాము ఇచ్చే మొత్తంలో భారీ కోత విధిస్తాయి. అలా చేస్తే ఆటోమేటిక్ గా క్వాలిటీలో రాజీ పడిపోయి అనుకున్న స్థాయిలో విజువల్ గ్రాండియర్స్ రాకపోవచ్చు.
హిందీ, మలయాళంలో ఈ తరహా ప్రాక్టీస్ ఉన్నప్పటికీ దీని వల్ల డిజాస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. సినిమా హిట్ అయితే పర్వాలేదు కానీ తేడా కొడితే రెండు నెలల తర్వాత దాన్ని డిజిటల్ లో చూసేందుకు కూడా ఆడియన్స్ ఆసక్తి చూపించడం లేదు. దీని వల్ల ఓటిటి వ్యూస్ తగ్గిపోయి అదే బ్యానర్ లో నిర్మాణంలో ఉన్న ఇతర సినిమాల హక్కుల మీద ప్రభావం చూపిస్తోంది. అందులోనూ గంపగుత్తగా డీల్స్ మాట్లాడుకుంటున్న నిర్మాతలే ఎక్కువ.
తదుపరి దఫా చర్చల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. SIFPAగా పిలవబడే ఈ అసోసియేషన్ ద్వారా ఇకపై ప్రధాన కమ్యూనికేషన్లు జరగబోతున్నాయి. ప్రొడ్యూసర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా తమకు అనుకూలంగా ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే అన్ని పనులు చేసుకోవచ్చని, ఏదైనా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి తప్పించి ఏకపక్షంగా కుదరవని అందులో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇతరుల రియాక్షన్లు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates