Movie News

బడ్జెట్ 10 కోట్లు… వసూళ్లు 200 కోట్లు

మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద ఆ ఖర్చుకు తగ్గ ఔట్ పుట్ కనిపించదు. మామూలు సినిమాలకు కూడా నెలలు, సంవత్సరాలు సమయం తీసుకుంటూ ఉంటారు. అంత సుదీర్ఘ కాలం తీసిన సినిమాల్లో చివరికి కంటెంట్ చూస్తే అంతంతమాత్రంగా ఉంటుంది. విషయం బలంగా లేకుండా ఎంత ఖర్చు పెట్టి హంగులు జోడించినా, ఎంత భారీతనం ఉన్నా అవేమీ సినిమాకు అక్కరకు రావని అనేక సినిమాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. 

కానీ మలయాళంలో మాత్రం వ్యవహారం ఇలా ఉండదు. అక్కడ ఫోకస్ అంతా కథ మీదే ఉంటుంది. పరిమిత బడ్జెట్లలో, తక్కువ రోజుల్లో సినిమాలు పూర్తి చేస్తారు. స్టార్లను కాకుండా కథను నమ్ముకుని, కొత్త వాళ్లతోనే అద్భుతాలు ఆవిష్కరిస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర ఆ చిన్న బడ్జెట్ చిత్రాలకే భారీ వసూళ్లు వస్తుంటాయి. ఇటీవల మలయాళం బాక్సాఫీస్‌లో ఒక చిన్న సినిమా ఇలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే.. వాళా-2.

స్కూల్ పిల్లల కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటించారు. బడ్జెట్ కేవలం రూ.10 కోట్లు. ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం గురించి కొన్ని రోజుల ముందు అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఐతే ఈ చిన్న సినిమా సంచలనం అంతటితో ఆగిపోలేదు. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని అందుకుంది. విడుదలైన 20 రోజుల్లోనే ‘వాళా-2’ ఈ ఘనత సాధించడం విశేషం. మూడో వారంలోనూ కొత్త సినిమాలా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అవుతోంది ఈ మూవీ. కేరళలో ఈ సినిమాకు ఈ వీకెండ్లో టికెట్లు దొరకడం కష్టంగా ఉంది.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి లాంటి నగరాల్లోనూ ఈ సినిమాకు అదిరే స్పందన వస్తోంది. మలయాళ వెర్షన్‌ను ఎగబడి చూస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే వారం తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో టాలీవుడ్‌కు చెందిన సాహు గారపాటి కూడా ఒకరు కావడం విశేషం. ఈ సంక్రాంతికి తెలుగులో ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. ఇప్పుడు మలయాళంలో ‘వాళా-2’ రూపంలో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

This post was last modified on April 19, 2026 4:21 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

5 hours ago