Movie News

ప్రమోషన్లు బాగున్నాయి… జనాలు రావడమే తరువాయి

రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో అంతకన్నా ఎక్కువే చేశారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిన్న మూవీకి నిర్మాత కిరణ్ అబ్బవరం చేసిన ప్రచారం నిజంగా ఆకట్టుకునేలా సాగింది. నిన్న టీమ్ మొత్తానికి ప్రసాద్ బిగ్ స్క్రీన్ లో ప్రీమియర్ వేయడం ద్వారా ఫైనల్ చాప్టర్ పూర్తి చేశారు. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ట్వీట్లు ఒకటా రెండా ఏదో తోస్తే అది చేసుకుంటూ పోయారు.

‘పాపం ప్రతాప్’ సైతం నేనేం తీసిపోలేదనే తరహాలో పోటాపోటీగా ప్రమోషన్లు చేసుకుంది. తిరువీర్ రెండు వారాలుగా నిద్రాహారాలు మాని మరీ ఆడియన్స్ కళ్ళలో పడేందుకు బాగా కష్టపడ్డాడు. ఈటీవీ విన్ నిర్మాణం కావడంతో ప్రమోషన్ విషయంలో బోలెడంత సపోర్ట్ దొరికింది. ముఖ్యమైన ట్విస్టుని నిన్న సోషల్ మీడియాలో రివీల్ చేయడం ద్వారా మరింత బజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. మలయాళం డబ్బింగ్ మూవీ ‘పల్లిచట్టంబి’కి ప్రస్తుతానికి ఎలాంటి బజ్ కనిపించడం లేదు.

నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ కూడా వీటితో పాటే వస్తోంది. ప్రమోషన్ల విషయంలో టీమ్ పైన చెప్పిన వాటంత దూకుడుగా లేదు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంచనాలు పెంచలేకపోయాయి కానీ థియేటర్లో సర్ప్రైజ్ ఇస్తుందని నిర్మాత ధీమాగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప పెద్దగా హడావిడేం చేయలేదు. అక్షయ్ కుమార్ బాలీవుడ్ మూవీ ‘భూత్ బంగ్లా’కు ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్స్ వేస్తున్నారు. ‘లీ క్రోనిన్స్ మమ్మీ’  మీద హారర్ లవర్స్ ఆసక్తిగానే ఉన్నారు.

మిస్టర్ ఎక్స్, తెరచాప, కాలగమనం, గాలి అనే మరో నాలుగు స్ట్రెయిట్ సినిమాలు వీటిలో పాటు వస్తున్నాయి. కౌంట్ అయితే పెద్దదే ఉంది కానీ బుక్ మై షో గమనిస్తే ఏ ఒక్కటి గంటకు లేదా ఇరవై నాలుగు గంటలకు సంబంధించి ఏ సినిమా ఇంకా ట్రెండింగ్ లోకి రాలేదు. అంటే ఆడియన్స్ టాక్, రివ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైపోయింది. డెకాయిట్, బైకర్, రాకాసలు నెమ్మదిస్తున్నాయి. కొత్త వీకెండ్ లో ఆ అవకాశాన్ని కొత్త రిలీజుల్లో ఏవి అంది పుచ్చుకుంటాయో రేపటికి తేలనుంది.

This post was last modified on April 16, 2026 10:50 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago