పెద్ది వాయిదాలతో అభిమానులు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. మార్చి 26, ఏప్రిల్ 30 రెండు మంచి డేట్లు మిస్సైపోయాయి. కొత్త తేదీని ఇంకా ప్రకటించ లేదు. అసలు ఐటెం సాంగ్ లో డాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరో దర్శకుడు బుచ్చిబాబు ఇంకా తేల్చలేదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. పెద్ది విడుదలకు సిద్ధమైతే తప్ప చరణ్ నెక్స్ట్ చేయబోయే సుకుమార్ మూవీని పట్టాలు ఎక్కించలేడు. ఆల్రెడీ దాని స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ కల్ట్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఒక ప్యాన్ ఇండియా మూవీ అది కూడా రామ్ చరణ్ తో చేసే ప్రణాళికలో ఉన్నట్టు ముంబై మీడియా రిపోర్ట్. ఈయన ప్రస్తుతం రన్బీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ కాంబినేషన్ లో లవ్ అండ్ వార్ తీస్తున్నారు. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సింది కానీ ప్రొడక్షన్, విఎఫెక్స్ వల్ల బాగా లేట్ అయిపోయింది. ఎలాగూ దీపావళికి రామాయణ వస్తుంది కాబట్టి లవ్ అండ్ వార్ ని 2027కి షిఫ్ట్ చేశారు.
ఇక సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే రామ్ చరణ్, భన్సాలీ కాంబో కుదిరితే మంచిదే. విజువల్ గ్రాండియర్స్ ని ఎమోషన్స్ తో బ్యాలన్స్ చేస్తూ ఎన్నో గొప్ప సినిమాలు తీసిన సంజయ్ లీలా భన్సాలీ తనదైన ముద్రతో గంగూభాయ్ కటియావాడి, పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి క్లాసిక్స్ ఇచ్చారు. రామ్ చరణ్ ని యుద్ధ వీరుడిగానో లేదా చారిత్రక పురుషుడిగానో చూపిస్తే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతాయి. ప్రస్తుతానికి ఇదంతా గాసిప్ స్టేజిలో ఉంది.
కాంబినేషన్ల ఎంపిక ఎలా ఉన్నా రామ్ చరణ్ వేగం పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా ఇవ్వాలని, ఇండస్ట్రీకి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా పదహారో మూవీ దగ్గరే ఉండటం వాళ్ళ అసంతృప్తికి కారణం. పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాల్లో బిజీగా ఉంటే అది వేరే విషయం కానీ చరణ్ కు అలాంటి టెన్షన్లేవి లేవు. అయినా సరే ఆర్ఆర్ఆర్ తెచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకునేందుకు సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
This post was last modified on April 11, 2026 4:03 pm
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…