అనన్య పాండే.. రాబోయే రోజుల్లో పెద్ద స్టార్ కాగల హీరోయిన్‌గా అంచనాలున్న బాలీవుడ్ భామ. నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ విశ్లేషకులు ఈ అమ్మాయి మీద అంచనాలు భారీగానే పెంచేస్తున్నారు. ఆమె ఫొటో షూట్లు చూస్తే ఈ అభిప్రాయం తప్పేమీ కాదనిపిస్తుంది. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్, సెన్సెటివ్ అనిపిస్తుంది కానీ.. ఫిగర్ విషయంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ఎప్పటికప్పుడు హాట్ పొటో షూట్లతో కుర్రాళ్లకు వల విసురుతూనే ఉంటుంది అనన్య.
తాజాగా తన సన్నజాజి నడుంను.. క్లీవేజ్ అందాలను ఎలివేట్ చేస్తూ చేసిన ఫొటో షూట్ యువ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆమె నడుం మాయలో పడితే కుర్రాళ్లు తేరుకోవడం కష్టమే అన్నట్లుగా ఉన్నాయి ఈ ఫొటోలు.
సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురైన ఈ అమ్మాయి స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2 సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో, అంగ్రేజీ మీడియం, ఖాలి పీలి లాంటి సినిమాల్లో మెరిసింది అనన్య. ఐతే కెరీర్ ఓ మోస్తరుగా సాగిపోతోంది కానీ.. అనన్య కోరుకున్న సూపర్ హిట్టయితే ఆమెకు ఇంకా రాలేదు.
ప్రస్తుతం అనన్య ఆశలన్నీ విజయ్ దేవరకొండ సరసన చేస్తున్న ఫైటర్ మీదే ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీతో దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగుతుందని ఆమె ఆశిస్తోంది. ఈ చిత్ర బృందం త్వరలోనే మళ్లీ షూటింగ్‌కు సిద్ధమవుతోంది. దీంతో పాటు అనన్య.. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ నటిస్తోంది.
This post was last modified on December 27, 2020 10:20 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…