సినీ రంగంలో ఏ విభాగంలో సత్తా చాటిన టెక్నీషియన్‌కైనా.. దర్శకత్వం మీద దృష్టి ఉంటుంది. తమ విభాగంలో ఎంత ప్రతిభ చాటుకున్నప్పటికీ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే కాబట్టి.. ఆ గౌరవాన్ని పొందాలని కోరుకుంటారు. అందుకే రచయితలు, ఎడిటర్లు, కెమెరామెన్‌లు, ఫైట్ మాస్టర్లు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు.. ఇలా వివిధ విభాగాల వాళ్లు దర్శకత్వం మీద దృష్టిసారిస్తుంటారు. అప్పుడప్పుడూ సంగీత దర్శకులకు కూడా ఇటు వైపు మనసు లాగుతుంటుంది.
ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న ఆర్పీ పట్నాయక్ సైతం మెగా ఫోన్ మీద ఆశలు పెంచుకున్నవాడే. దర్శకుడు కావడం కోసం సంగీత దర్శకుడిగా తన కెరీర్‌నే పణంగా పెట్టేంత ప్యాషన్ ఆర్పీది. అతను పుష్కర కాలం కిందటే, సంగీత దర్శకుడిగా మంచి ఊపులో ఉండగానే ‘అందమైన మనసులో’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ‘బ్రోకర్’ అనే సినిమా తీశాడు. తొలి సినిమాతో పోలిస్తే ఇది పర్వాలేదనిపించింది కానీ.. అనుకున్నంతగా ఆడలేదు.
అయినా సరే ఆర్పీ పోరాటం ఆపింది లేదు. ఫ్రెండ్స్ బుక్ అని.. అమీ అని.. తులసీదళం అని.. మనలో ఒకడు అని సినిమాలు తీస్తూ పోయాడు. కానీ ఏదీ ఫలితాన్నివ్వలేదు. అయినా అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు. కొంత విరామం తర్వాత ఆర్పీ మళ్లీ ఓ సినిమా తీశాడు. ఈసారి అతను థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. దాని పేరు.. ‘కాఫీ విత్ కిల్లర్’. ఈ సినిమా మొదలైన సంగతి కూడా ఎవరికీ తెలియదు. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసి ప్రి లుక్ పోస్టర్ వదిలాడు ఆర్పీ. ఇది తన నుంచి వస్తున్న సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటూ తాజాగా ట్విట్టర్లో ప్రి లుక్ రిలీజ్ చేశాడు ఆర్పీ.
ఈ చిత్రాన్ని గౌతమ్ పట్నాయక్ అనే కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేశాడు. పేరు చూస్తే ఆర్పీ కుటుంబ సభ్యుడే అనిపిస్తోంది. అంటే ఇది ఆయన సొంత సినిమా అన్నమాట. మరి ఇంత కష్టపడుతూ.. మ్యూజిక్ కెరీర్ త్యాగం చేసి మరీ సినిమాలు తీస్తూ పోతున్న ఆర్పీకి ఇప్పుడైనా దర్శకుడిగా తొలి విజయం దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on December 26, 2020 1:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…