Movie News

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా కూడా అవి ఆగడం లేదు. దీనికి తోడు హనుమాన్ జయంతి సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడం అనుమానాలను మరింత బలపరిచింది. అయితే రాకసా బృందంతో చేసిన ఇంటర్వ్యూ వీడియోలో చరణ్ ఇంకో ముఖ్యమైన సంగతి పంచుకున్నాడు. ఒక్క పాట తప్ప టాకీ మొత్తం పూర్తయ్యిందని చెప్పేశాడు. సో ఐటెం సాంగ్, రెహమాన్ రీరికార్డింగ్ అయిపోతే హమ్మయ్యా అనుకోవచ్చు.

ఇంకోవైపు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉన్నారు. 27 నుంచి నార్త్ అమెరికాలో ప్రీమియర్లు ఉంటాయని ఊరిస్తున్నారు. డల్లాస్ బుకింగ్ స్క్రీన్ షాట్లు చక్కర్లు కొడుతున్నాయి.

చేతిలో కేవలం 28 రోజులే ఉన్న నేపథ్యంలో డెడ్ లైన్ మీట్ కావడం చాలా కష్టం. కానీ రామ్ చరణ్ మాత్రం చివరి బంతి వరకు ఆడాలనే నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంటే వీలైనంత వరకు ఏప్రిల్ 30 లక్ష్యంగా పెట్టుకుని షూట్ వేగవంతం చేద్దామని, ఎంతైనా కష్టపడదామని సూచించి దానికి అనుగుణంగానే పరుగులు పెట్టిస్తున్నాడట. అయితే ప్రాక్టికల్ గా ఇది అంత సులభం కాదని, ఐటెం సాంగ్ ఎవరితో ఉంటుందో ఇప్పటికీ క్లారిటీ లేదని ఇన్ సైడ్ టాక్.

ఏప్రిల్ 8 దాకా స్పష్టత వచ్చే అవకాశం లేనట్టే. ఒకవేళ ఆ రోజు యుఎస్ బుకింగ్స్ మొదలుపెడితే దాదాపు రిలీజ్ ఆన్ టైం ఉన్నట్టే. ఇన్ సైడ్ సోర్స్ మాత్రం ఛాన్స్ తక్కువనే చెబుతోంది. స్వయంభు, మా ఇంటి బంగారం, వీసా లాంటివి పెద్ది అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ చరణ్ అధికారికంగా రాడని తెలిస్తే వెంటనే తాము వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఈ గందరగోళం ట్రేడ్ వర్గాలకు సైతం ఇబ్బందిగా మారింది.

ఎందుకంటే థియేటర్ అగ్రిమెంట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలి. అసలే నైజామ్ లో సింగల్ స్క్రీన్లు పర్సెంటేజ్ పద్ధతిలోకి వస్తున్నాయి. మైత్రి ఈ పరిణామం పట్ల అంత సానుకూలంగా లేదని ఫిలిం నగర్ టాక్. పెద్దికున్న హైప్ కి పుష్ప రేంజ్ ఓపెనింగ్స్ ఆశిస్తున్న నేపథ్యంలో మూడోసారి పోస్ట్ పోన్ అంటే అసహనం కలిగించేదే. కాకపోతే తప్పని పరిస్థితిలో ఎవరైనా ఏం చేయలేరుగా. చూడాలి మరి చివరి బాల్ దాకా మ్యాచ్ ఆడుతున్న పెద్ది సిక్సర్ కొట్టి ఏమైనా సెన్సేషన్ చేస్తాడేమో.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

22 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

53 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago