సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు వేసే వాళ్లు మరీ తక్కువ. ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో కాస్త పేరున్న లేడీ డైరెక్టర్ల లిస్టు తీస్తే అది డబుల్ డిజిట్‌కు కూడా వెళ్లదు. ఈ తరంలో చెప్పుకోదగ్గ మహిళా దర్శకురాలు అంటే నందిని రెడ్డి మాత్రమే. ఆమెలా ట్రెండీగా సినిమాలు తీస్తూ పేరు సంపాదించిన మహిళా దర్శకులు మరొకరు కనిపించరు.
ఐతే ఇప్పుడు నందిని తరహాలో పురుష దర్శకులకు దీటుగా ట్రెండీ సినిమా తీయగల సత్తా ఉన్న దర్శకురాలిగా మానస శర్మ అనే కొత్తమ్మాయి ఆశలు రేకెత్తిస్తోంది. నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో ఒక షార్ట్ ఫిలిం చేసి మెప్పించిన ఈ అమ్మాయి.. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘రాకాస’తో ఫీచర్ ఫిలిం దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఈ సినిమా ప్రోమోలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ఇది ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తే సినిమా అవుతుందనే అంచనాలున్నాయి.
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో ఎంటర్టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు సంగీత్ శోభన్. మంచి కామెడీ టైమింగ్‌కు ఉన్న అతడితో హార్రర్ టచ్ ఉన్న ఫాంటసీ సినిమా చేయాలనుకోవడంతోనే మానస సగం విజయం సాధించింది. ప్రోమోల్లో కథాంశం, విజువల్స్, ఫన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మానస నరేషన్ చాలా ట్రెండీగా అనిపించింది టీజర్, ట్రైలర్లలో. ఆమెను నమ్మి నిహారిక పెద్ద బడ్జెట్టే పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. కావాల్సిందల్లా మంచి టాకే.
ఈ రోజు రాత్రి ప్రిమియర్స్ నుంచి టాక్ వచ్చిందంటే ‘రాకాస’ మంచి విజయం సాధించబోతున్నట్లే. అదే జరిగితే తెలుగు సినిమాకు చాన్నాళ్ల తర్వాత ఓ ట్రెండీ లేడీ డైరెక్టర్ దొరికినట్లే. మానస లుక్స్.. ‘ఓయ్’ సినిమాలో షామిలిని తలపించేలా ఉండడంతో ఆమె ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక కంటెంట్‌తోనూ మెప్పించిందంటే తన పేరు మార్మోగడం ఖాయం.
This post was last modified on April 3, 2026 9:35 am
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…