Movie News

డెకాయిట్ ఎత్తులు దేనికోసం?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పటివరకు శేష్ చేసిన సినిమాలన్నీ ఎక్కువగా సిటీ ఆడియెన్స్‌ను, క్లాస్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు వస్తున్న ‘డెకాయిట్’ చిత్రంతో శేష్ తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా, ఈసారి పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో బాక్సాఫీస్ దగ్గర కేకలు పెట్టించాలని ఆయన గట్టిగానే ఫిక్స్ అయ్యారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు చూస్తుంటే శేష్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. గడ్డంతో, సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఆహార్యం మాస్ ఆడియెన్స్‌కు కావాల్సిన కిక్ ఇస్తోంది. ముఖ్యంగా ‘చిచ్చుబుడ్డి’ స్పెషల్ సాంగ్ ఈ సినిమాపై మాస్ వైబ్స్ క్రియేట్ చేయడానికే. సాధారణంగా శేష్ సినిమాల్లో ఇలాంటి ఊరమాస్ సాంగ్స్ ఉండవు, కానీ డెకాయిట్ కోసం మాస్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని అర్ధమవుతుంది. 

ఏప్రిల్ 4న విడుదల కాబోతున్న అఫీషియల్ ట్రైలర్ ఈ సినిమాలోని అసలు కంటెంట్ ఏంటో క్లారిటీ ఇవ్వనుంది. ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ’ అనే ట్యాగ్‌లైన్ ఉన్నప్పటికీ, టీజర్ పోస్టర్లలోని హడావుడి చూస్తుంటే ఇందులో ఒక పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. క్లాస్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తూనే, మాస్ ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్ సీక్వెన్సులను డిజైన్ చేశారట. ఇప్పటికే సెన్సార్ నుంచి ‘U/A’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 10న థియేటర్లలో ఏ స్థాయి రచ్చ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఇప్పటికే ఓ మోస్తరు సౌండ్ క్రియేట్ చేసింది. ఒకవేళ ట్రైలర్‌లో కంటెంట్ గనుక సరిగ్గా పేలిత అడివి శేష్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం ఖాయం. మాస్ ఆడియెన్స్‌కు శేష్ ఇచ్చే ఈ సరికొత్త ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on April 2, 2026 7:15 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

2 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

3 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

3 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

7 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

8 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

9 hours ago