Political News

సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకి సొంత పార్టీ షాక్

రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. పార్టీ పేర్లు వేర్వేరుగా ఉన్నా.. రాజకీయ పార్టీల డీఎన్ ఏ మాత్రం ఒకేలా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ. దేశంలోని రాజకీయ పార్టీలకు భిన్నంగా.. రాజకీయాల కంటే కూడా ప్రజల కోసం పోరాటం చేయటమే లక్ష్యమని చెప్పే పార్టీ.. మిగిలిన పార్టీల మాదిరే తన పార్టీకి చెందిన ఎంపీకి షాకిచ్చింది. ఇంతకూ ఆ ఎంపీ ఎవరో కాదు రాఘవ్ చద్దా.

సామాన్యుడు.. సగటు జీవి నిత్యం ఎదుర్కొనే ఎన్నో సమస్యల మీదా.. రోజువారీ జీవనంలో పలు విషయాల్లో దోపిడీకి గురయ్యే అంశాల్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ.. అందరిని ఆకర్షించే ఆయనకు ఆమ్ఆద్మీ పార్టీ షాకిచ్చింది. రాజ్యసభలో ఉప నాయకుడిగా వ్యవహరిస్తున్న ఆయన్ను.. ఆ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాఘవ్ చద్దా విషయానికి వస్తే.. సెల్ ఫోన్ రీఛార్జి విషయంలో ప్రైవేటు టెలికం కంపెనీల దోపిడీపైనా.. మొబైల్ డేటా వినియోగంపైనా.. విమాన సమయపాలన మీదా.. మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల మీదా.. మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే బ్యాంకుల తీరుపైనా.. ఇలా ఎన్నో అంశాలపై గళం విప్పటం ద్వారా ఆయన ప్రజల్లో పాపులార్టీని సొంతం చేసుకున్నారు.

ఆయన ప్రశ్నలు.. లేవనెత్తే అంశాలు తరచూ సోషల్ మీడియాలో చర్చకు తెర తీస్తుంటాయి. అలాంటి ఆయన్ను రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమిస్తూ రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారాన్ని పంపిన విషయాన్ని ఆమ్ ఆద్మీ వర్గాలు వెల్లడించాయి. ఎందుకిలా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వస్తోంది. పార్టీ అధినాయకత్వం గురించి.. అధినేతల గురించి మాట్లడని రాఘవ్ చద్దా తీరుపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా రాఘవ్ చద్దా నుంచి స్పందన లేకపోవటాన్నితీవ్రంగా పరిగణించినట్లు చెబుతున్నారు. కనీసం సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు పెట్టకపోవటం దేనికి నిదర్శనం? అని వాదన పార్టీలో బలంగా సాగినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు పలు సందర్భాల్లో పార్టీ కీలక సమావేశాలకు గైర్హాజరు కావటం.. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేసినప్పుడు ఆలస్యంగా స్పందించటం లాంటి అంశాల నేపథ్యంలో ఆయనకు.. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనాయకుడి పదవి నుంచి తీసేసినట్లుగా తెలుస్తోంది.

This post was last modified on April 2, 2026 10:32 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

2 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

3 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

4 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

8 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

8 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

10 hours ago