Movie News

ఇలా అర్థం చేసుకున్నారా.. టొవినో ఆవేద‌న‌

మ‌ల‌యాళ స్టార్ హీరో టొవినో థామ‌స్.. తాను జూనియ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న‌ డ్రాగ‌న్ (వ‌ర్కింగ్ టైటిల్) మూవీలో ఎందుకు న‌టించ‌ట్లేదో వివ‌రించి చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. ముందు టొవినో ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాను ఆ సినిమా చేయ‌ట్లేద‌ని.. తెలుగులో సినిమాల చిత్రీక‌ర‌ణ సుదీర్ఘంగా, ఎక్కువ షెడ్యూల్స్‌లో జ‌రుగుతుంద‌ని.. ఇక్క‌డ ఒక సినిమా చేస్తే తాను న‌టించే నాలుగైదు సినిమాల మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని వివ‌రించాడు టొవినో.

ఐతే తాను ఇంత వివ‌రంగా విష‌యం చెప్పినా.. జ‌నం మాత్రం మ‌రోలా త‌న వ్యాఖ్య‌ల‌ను అర్థం చేసుకున్నాడంటూ ఈ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చాడు టొవినో. త‌న‌కు డ్రాగ‌న్ సినిమాలో న‌టించ‌డం ఇష్టం లేద‌న్న‌ట్లుగా త‌న వ్యాఖ్య‌ల‌ను ప్రొజెక్ట్ చేయ‌డం ప‌ట్ల టొవినో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ కార‌ణంతోనే తాను ఎక్కువ‌గా మౌనం వ‌హిస్తుంటాన‌ని అత‌నన్నాడు.

”నిన్న ఒక ప్రెస్ మీట్లో ఓ విష‌యం మీద మాట్లాడాను. కానీ నా మాట‌ల‌ను కొంద‌రు త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. డ్రాగ‌న్ సినిమాలో న‌టించ‌డం నాకు అస్స‌లు ఇష్టం లేద‌న్న‌ట్లుగా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఏమైనా మాట్లాడితే ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి కాబ‌ట్టే నేను మౌనం వ‌హిస్తుంటా. ఒకే స‌మ‌యంలో నేను వేర్వేరు ప‌నులు చేయ‌లేను. ఇదొక భిన్న‌మైన వ‌ర్కింగ్ స్టైల్.

దీన్నే ఎంతో కాలం నుంచి అనుస‌రిస్తున్నా. కానీ నా మాట‌ల‌ను స‌రిగ్గా అర్థం చేసుకోలేక‌పోయారు. నాకు సినిమాల్లో న‌టించ‌డం ఇష్టం. డ‌బ్బు లేదా స్టార్‌డం కంటే మూవీ మేకింగ్ ప్రాసెస్‌ను నేనె ఎక్కువ ఎంజాయ్ చేస్తాను” అని టొవినో తెలిపాడు.

త‌న‌కు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ అంటే ఎంతో ఇష్ట‌మ‌న్న టొవినో.. ఆయ‌న వ‌ర్కింగ్ స్టైల్‌ను ఇష్ట‌ప‌డ‌తాన‌న్నాడు. తాను భాగం కాకపోయిన‌ప్ప‌టికీ.. డ్రాగ‌న్ సినిమా భారీ విజ‌యాన్ని అందుకోవాల‌ని టొవినో ఆకాంక్షించాడు. టొవినో హీరోగా న‌టించిన ప‌ల్లిచ‌ట్టంబి ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో ఫంకీ భామ కాయ‌దు లోహ‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది.

This post was last modified on April 1, 2026 10:20 pm

Share

Recent Posts

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

35 minutes ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

55 minutes ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

1 hour ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

1 hour ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

3 hours ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

6 hours ago