తన వందో సినిమాను చడీ చప్పుడు లేకుండా మొదలుపెట్టి.. చకచకా పూర్తి చేసేస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ సినిమాకు దర్శకుడిగా ముందు ఏవేవో పేర్లు వినిపించగా.. చివరికి తమిళ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్‌ను ఎంచుకుని, సొంత బేనర్లో ప్రొడ్యూస్ చేస్తున్నాడు నాగ్. ఇది అభిమానులకు విందు భోజనం లాంటి సినిమా అని.. ఇందులో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని నాగ్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నాగ్ భిన్న అవతారాల్లో కనిపించబోతున్నాడు. ఆయన సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట. అందులో ఒకరు సీనియర్ హీరో టబు అని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే లాంటి చిత్రాలతో ఎవర్ గ్రీన్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ్, టబు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలిసి తెరపై కనిపించబోతుండడం నిన్నటి తరం ప్రేక్షకులకు నోస్టాల్జిక్ ఫీల్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్ ఖరారైందన్నది తాజా సమాచారం. ఈ తెలుగమ్మాయి తమిళంలో స్టార్ హీరోయిన్ అయ్యాక తెలుగులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీకి జోడీగా నటించింది ఐశ్వర్య. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ.. ఐశ్వర్యకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఇప్పుడు వెంకీ తరం సీనియర్ హీరో అయిన నాగ్ సరసన ఆమెకు ఛాన్స్ దక్కింది. ఈ చిత్రంతో సుస్మితా భట్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. ఈ తమిళ అమ్మాయి.. గతంలో తెలుగులో నాట్యం అనే క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో సాగే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఈ వయసులోనూ నాగ్ ముగ్గురు హీరోయిన్లతో జట్టు కడుతుండడం విశేషమే.
ఈ వేసవికల్లా నాగ్ వందో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. నాగ్ పుట్టిన రోజు అయిన ఆగస్టు 29న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉందట టీమ్. ఇప్పటిదాకా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఏ విశేషాన్నీ పంచుకోలేదు నాగ్ బృందం.
This post was last modified on March 30, 2026 11:52 am
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…