Movie News

‘బరి’ దర్శకుడు భలే చెప్పాడు

ఓటీటీల్లో మలయాళం సినిమాలను కొన్నేళ్లుగా విరగబడి చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అక్కడి సినిమాల్లో కంటెంట్ చూసి ఇలాంటివి తెలుగులో తీయరేంటి అని మన ప్రేక్షకులు బాధ పడడం మామూలే. అదే సమయంలో ఇక్కడ ఏదైనా మంచి సినిమా వచ్చి ఆదరణకు నోచుకోకపోతే.. మనోళ్లు మలయాళం సినిమాలు చూస్తారు కానీ, మన చిత్రాలను పట్టించుకోరంటూ ఇక్కడి ఫిలిం మేకర్స్ ఫీలవుతుంటారు.

ప్రెస్ మీట్లలో కూడా మలయాళం చిత్రాల ప్రస్తావన రావడం.. జర్నలిస్టులు మన చిత్రాలను అక్కడి వాటితో పోల్చి మాట్లాడడం మామూలే. శనివారం ముహూర్త వేడుక జరుపుకున్న ‘బరి’ సినిమా ప్రెస్ మీట్లో ఇలాంటి ప్రస్తావనే వస్తే.. దర్శకుడు యదువంశీ భలే స్టేట్మెంట్ ఇచ్చాడు.

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో ఆకట్టుకున్న యదువంశీ.. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను హీరోగా పెట్టి ‘బరి’ తీస్తున్నాడు. ఇది వాలీబాల్ నేపథ్యంలో సాగే రూరల్ డ్రామా అని ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో.. ఫస్ట్ పోస్టర్ చూస్తే మలయాళం చిత్రాలు గుర్తుకు వస్తున్నాయని, అక్కడే ఇలాంటి కంటెంట్ సినిమాలు వస్తాయని ఓ జర్నలిస్ట్ ప్రస్తావించగా, దానికి యదువంశీ బదులిస్తూ..

‘‘సార్ ఇక మలయాళం గురించి మాట్లాడక్కర్లేదు. మేమున్నాం. మేం తీస్తాం. మన సినిమాలు.. మన కథలు.. మన విలువలతో మేం సినిమాలు తీయగలం. నేను తీసి చూపిస్తాను. నాలాగే చాలామంది ఫిలిం మేకర్స్ ఉన్నారు. నిహారిక లాంటి నిర్మాతలు ఉన్నారు. అవకాశాలు రాక చాలామంది కృష్ణానగర్‌లోనో, ఫిలిం నగర్లోనో ఉండిపోతున్నారు. నాకు ఛాన్స్ దొరికింది. నేను చూపిస్తాం. మలయాళం, తమిళం అక్కర్లేదు. మనమే అక్కడికి వెళ్దాం’’ అంటూ చాలా ధీమాగా మాట్లాడాడు యదువంశీ.

క్రికెట్‌లాగా వాలీబాల్ పాపులర్ కాదు కదా అని అడిగితే.. ‘‘ఏ ఆటకు ఆ ఆటే. మనకు రగ్బీ తెలుసా. అప్పట్లోనే రాజమౌళి గారు సై సినిమా తీశారు. ఇప్పటివరకు వాలీబాల్ సినిమాను స్క్రీన్ మీద చూడలేదు. మేం కచ్చితంగా కొత్తగా చూపిస్తాం’’ అని యదువంశీ చెప్పాడు. తన కాన్ఫిడెన్ చూస్తే ‘బరి’ చాలా స్పెషల్ మూవీ కాగలదనే అంచనాలు ఏర్పడ్డాయి. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని నిర్మించిన నిహారిక కొణిదెలనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమా ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

This post was last modified on March 28, 2026 2:13 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

10 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

20 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

37 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

57 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago