మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ ఓ హిలేరియస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. పెళ్లంటే నూరేళ్ల మంట అని బలంగా నమ్మే కుర్రాడు.. తన లాంటి బ్యాచిలర్లందరినీ వెంటేసుకుని పెళ్లికి వ్యతిరేకంగా పోరాడటం.. కానీ మధ్యలో ఓ అమ్మాయి అతడి జీవితంలోకి ప్రవేశించి తన ఆలోచనలు మార్చడం.. ఈ సంఘర్షణలో పుట్టే కామెడీ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. దీని ట్రైలర్ చాలా సరదాగా సాగి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా పోస్టర్లో, ఇతర ప్రోమోల్లో సీనియర్ నటుడు, దర్శకుడు నారాయణమూర్తి బాగా హైలైట్ అవడం తెలిసిందే. ఆయన పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఐతే ఓ సందర్భంలో పెళ్లి చేసుకోకుండా తప్పు చేశానని, పెళ్లి చేసుకోవడం ప్రకృతి ధర్మమని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మాటనే ట్రైలర్ చివర్లో చూపించడం, హీరో కంగుతినడం భలే ఫన్నీగా అనిపించింది.
ఐతే తమ సినిమా కోసం నారాయణ మూర్తిని ఇంతగా వాడుకుంటున్నపుడు ఆయన అనుమతి తీసుకోవడం అవసరం. ఆ పని తాము చేశామని.. ఈ కథ గురించి నారాయణమూర్తికి వివరించాకే సినిమా తీశామని తేజు తెలిపాడు. ఈ కథ విన్నవెంటనే ఆర్ నారాయణమూర్తిగారి అనుమతి తీసుకోవాలి అనిపించింది. ఐతే తేజు అప్పటికే సుబ్బు ఆయన అనుమతి తీసుకున్నట్లు చెప్పాడు. మూర్తి గారు కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకుని మన ఇండస్ట్రీ కోసం మనం తప్పక నిలబడాలి.. తప్పకుండా సినిమా చేయండి అని చాలా సపోర్టివ్‌గా మాట్లాడారు. ఆయన్ని ఎప్పుడు కలిసిన సినిమా ఎలా వస్తోంది.. బాగా చేయండి అనేవారు. ఆయన సపోర్ట్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది అని తేజు చెప్పాడు.
సోలో బ్రతుకే సో బెటర్ కచ్చితంగా సూపర్ హిట్టయ్యే సినిమా అని.. ఈ సినిమాతో ఇండస్ట్రీలో మళ్లీ ఒక ఊపు వస్తుందని.. కుదిరితే తన ముగ్గురు మావయ్యలకు ఈ సినిమా స్పెషల్ షో వేయాలనుకుంటున్నామని తేజు వెల్లడించాడు.
This post was last modified on December 24, 2020 11:44 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…