Movie News

హిట్టు జంటను క్యాష్ చేసుకుందామనుకుంటే..

ఒక హిట్ సినిమాలో నటించిన జంటను రిపీట్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళ మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని వాడుకోవాలనుకోవడం రైటే. కానీ కేవలం కాంబోని తీసుకుని క్యాష్ చేసుకుందామని చూస్తే మాత్రం ముమ్మాటికీ రాంగ్ అవుతుంది. బ్యాండ్ మేళం చూస్తే ఇదే ఫీలింగ్ కలుగుతోంది. నిన్న విడుదల ముందు వరకు నిర్మాత కోన వెంకట్ టీమ్ చేసిన ప్రమోషన్ల హడావిడి అంతా ఇంతా కాదు. ఇది నెల రోజుల నుంచి జరుగుతూనే ఉంది.

తీరా చూస్తే బ్యాండ్ మేళం రొటీన్ పదం కూడా మరీ ఇంత రొటీన్ కంటెంట్ ఎలా తీశారని ఫీలయ్యే రేంజ్ లో దర్శకుడు విశ్వనాథ్ జనాన్ని విసిగించేశారు. శోభన్ బాబు కాలం నాటి బావ మరదళ్ల ప్రేమకథకు కాసిన్ని జబర్దస్త్ జోకులు, బ్యాండ్ మేళం వాయించే ఫ్రెండ్స్ గ్యాంగ్ జోడించి ఖంగాళీ చేసేసారు. వినోదం కోసం వచ్చిన వాళ్ళతో బాబోయ్ అనిపించేశారు. రివ్యూలు సైతం నెగటివ్ గానే వచ్చాయి. కోర్టు జంట రోషన్, శ్రీదేవి మీద కాంప్లిమెంట్స్ కన్నా కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి.

ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తించాలి. కేవలం కాంబినేషన్లతో పనయ్యే రోజులు పోయాయి. మొన్నటికి మొన్న గబ్బర్ సింగ్ హీరో, దర్శకుడు పద్నాలుగేళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తే ఏమయ్యింది. డబ్బింగ్ మూవీ దురంధర్ 2 ముందు ఓడిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అసలు రోషన్, శ్రీదేవికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న భ్రమలో కోన ఉన్నారో లేక సదరు దర్శకులు ఉన్నారో తెలియదు కానీ మొత్తానికి లెక్క తప్పారు.

క్వాలిటీ లేకపోతే ఈ రోజుల్లో నెగ్గుకురావడం కష్టం. లిటిల్ హార్ట్స్ ఎన్నో బడ్జెట్ పరిమితులను తట్టుకుని విజయం సాధించిందంటే దానికి కారణం కాంబో కాదు. జంబో లాంటి కంటెంట్. నవ్వించినా ఏడిపించిన అందులో నాణ్యత లేకపోతే ఆడియన్స్ ఎమోషన్ ఫీల్ కారు. బ్యాండ్ మేళంలో మిస్సయ్యింది ఇదే. హిట్టు కొట్టాలంటే మంచి కథ రాసుకున్నాక హీరో హీరోయిన్లను సెట్ చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు దొరికారు కదాని తర్వాత రాసుకోకూడదు. లేదంటే ఇలాగే మేళం వినిపించదు. 

This post was last modified on March 27, 2026 9:35 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago