Movie News

ప్రియదర్శి సినిమాకు ప్రచారం లేదేంటి

పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఎంత పేరు తెచ్చినా ప్రియదర్శికి మంచి బ్రేక్ గా నిలిచింది బలగం సినిమానే. గత ఏడాది కోర్ట్ రూపంలో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. సారంగపాణి జాతకం హడావిడి మిన్న విషయం సున్నాలా దారుణంగా పోయింది. మిత్రమండలి పెద్ద డిజాస్టర్. ప్రేమంటే మూవీ వచ్చిన సంగతే చాలా మందికి తెలియకుండానే వెళ్లిపోవడం అతిశయోక్తి కాదు.

ఇలా వరస ఫెయిల్యూర్స్ ప్రియదర్శి మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. తాజాగా సుయోధనతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు ప్రియదర్శి. సాయికుమార్ మరో కీలక పాత్ర పోషించారు. కానీ ఎలాంటి ప్రమోషన్లు లేవు. ఎక్కడా హడావిడి కనిపించడం లేదు. ప్రెస్ మీట్లు లాంటివి లేవు. సోషల్ మీడియాలో ఏదైనా సౌండ్ ఉందా అంటే అదీ భేతాళ ప్రశ్నే. కేవలం ట్రైలర్ మాత్రమే లాంచ్ చేసి మమ అనిపించడం తప్ప సుయోధన టీమ్ చేసింది అంతంతమాత్రమే.

కంటెంట్ బాగుంటే జనాలకు రీచ్ అవుతుంది. అందులో డౌట్ అక్కర్లేదు. కానీ కనీస స్థాయిలో దాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి వాటిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అసలే దురంధర్ ది రివెంజ్ తప్ప జనాలకు పెద్ద ఆప్షన్లు లేవు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో లాక్కొస్తోంది కానీ పనవ్వడం లేదు. బ్యాండ్ మేళంకు పాజిటివ్ రెస్పాన్స్ లేదు. తమిళ డబ్బింగులు యూత్ కొంత మేర ట్రై చేస్తుండగా హ్యాపీ రాజ్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.

ఇంత ఛాన్స్ పెట్టుకుని సుయోధన అలా సైలెంట్ గా ఉండటం విచిత్రమే. ఈ సంగతి పక్కనపెడితే ఆర్టిస్టుగా ప్రియదర్శి ఎంత బిజీగా ఉన్నా సక్సెస్ రేట్ మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. లేదంటే కనుమరుగయ్యే ప్రమాదముంది. తన మీద నమ్మకం ఉన్న జనాలు లేకపోలేదు. వాళ్ళను పోగొట్టుకొకూడదు. కౌంట్ ఎంత ముఖ్యమో క్వాలిటీ కూడా అంటే ఇంపార్టెంట్. ఇది మర్చిపోయి కేవలం చేస్తున్న సినిమాల నెంబర్ల మీద దృష్టి పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఖాయం.

This post was last modified on March 27, 2026 3:09 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

19 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

37 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

45 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago