Movie News

ఐపీఎల్ Vs పెద్ది… గత రికార్డులు మర్చిపోయారా?

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇండియాలో రెండు రకాల ఎంటర్టైన్మెంట్ లకు డోకా ఉండదు.. ఒకటి సినిమా, రెండోది క్రికెట్. ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఇప్పుడు ఐపీఎల్ ఎఫెక్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్చి 28 నుంచే కొత్త సీజన్ మొదలవుతుండటంతో, ఏప్రిల్ నెలాఖరు నాటికి క్రికెట్ ఫీవర్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా నైట్ షోల మీద ఐపీఎల్ ప్రభావం ఉంటుందని, కొన్ని చిన్న సినిమాల వసూళ్లు తగ్గే అవకాశం ఉందనేది కొందరి వాదన.

అయితే రామ్ చరణ్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఈ ఆందోళనలు అనవసరమనిపిస్తోంది. గతంలో 2018లో ‘రంగస్థలం’ సినిమా కూడా ఐపీఎల్ నడుస్తున్న సమయంలోనే మార్చి 30న విడుదలైంది. అప్పట్లో కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమైనా, చరణ్ తన నటనతో బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను తిరగరాశారు.

ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా కూడా అదే తరహాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాను ‘పెద్ది’ రూపంలో తీసుకువస్తున్నారు. గురువు బాటలోనే శిష్యుడు కూడా క్రికెట్ వేడిని తట్టుకుని నిలబడతారని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

నిజానికి సినిమా ఆడియన్స్ వేరు, క్రికెట్ ఆడియన్స్ వేరు. ఒక మంచి సినిమా వస్తే థియేటర్లకు వెళ్లడం అనేది తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్. ఐపీఎల్‌లో RCB, SRH, CSK లేదా ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్ల మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే కొంత ఇంపాక్ట్ ఉండవచ్చు కానీ, మిగతా సమయాల్లో ప్రేక్షకులు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 

గతంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి భారీ చిత్రాలు కూడా ఐపీఎల్ సీజన్‌లోనే విడుదలై ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. దీన్ని బట్టి చూస్తే కంటెంట్ పవర్‌ఫుల్‌గా ఉంటే క్రికెట్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదని అర్థమవుతోంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సమ్మర్ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ క్రికెట్ కంటే సినిమా చూడటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఐపీఎల్ మ్యాచ్‌లు సాధారణంగా యువతను ఆకట్టుకుంటాయి కానీ, కుటుంబం మొత్తం కలిసి ఎంజాయ్ చేయాలంటే ఒక మంచి కమర్షియల్ సినిమానే దిక్కు. 

పెద్ది సినిమాలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మెన్‌గా కనిపిస్తుండటం, దానికి తోడు విలేజ్ ఎమోషన్స్ కూడా ఉండటంతో ఫ్యామిలీస్ ఈ సినిమా వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా ఇప్పటికే ‘ఉప్పెన’తో తన మేకింగ్ స్టైల్ ఏంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు చరణ్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్టుపై బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు ఉన్నాయి.

బాక్సాఫీస్ దగ్గర ఐపీఎల్ పోటీ అనేది కేవలం ఒక పరీక్ష మాత్రమే. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే, క్రికెట్ ఫీవర్‌ను సైతం దాటుకుని ‘పెద్ది’ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా ఏప్రిల్ 30న బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఒకవైపు క్రికెట్ ఫోర్లు, సిక్సర్ల హోరు.. మరోవైపు రామ్ చరణ్ మాస్ జోరు. ఈ రెండింటి మధ్య ప్రేక్షకులు దేనికి పట్టం కడతారో చూడాలి.

This post was last modified on March 24, 2026 10:26 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

2 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

4 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

4 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

5 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

6 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

8 hours ago