Movie News

పండగ వస్తున్నా ‘రామాయణ’ సౌండ్ లేదే

భారతీయ చలనచిత్ర చరిత్రలో మొదటిసారి నాలుగు వేల కోట్లతో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్ గా ‘రామాయణ’ గురించి నిర్మాతలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం, రన్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన దాని ప్రకారం ‘రామాయణ పార్ట్ 1’ విడుదల ఈ ఏడాది దీపావళికి జరిగిపోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నెలలో వచ్చే తీరాలి.

కానీ ఇప్పటిదాకా రామాయణకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్లు మొదలుకాలేదు. ఇంకా ఎనిమిది నెలల సమయం ఉందని పైకి కనిపిస్తున్నప్పటికీ గ్లోబల్ లెవెల్ లో సినిమాని జనంలోకి తీసుకెళ్లాలంటే పబ్లిసిటీ ఆషామాషీగా ఉండకూడదు. 2027 ఏప్రిల్ లో వచ్చే వారణాసి కోసం రాజమౌళి ఆల్రెడీ మహేష్ బాబు టీమ్ తో విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇప్పించారు. టైటిల్ లాంచ్ గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇవన్నీ బజ్ కు ఉపయోగపడ్డాయి.

రామాయణ నుంచి అలాంటి సంకేతాలు ఏమి కనిపించడం లేదు. దర్శకుడు నితీష్ తివారి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 27 శ్రీరామ నవమి వస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా టీజర్ లేదా ట్రైలర్ లాంటిది వదలడం సమయోచితంగా ఉంటుంది. ప్రస్తుతానికి అలాంటి అప్డేట్ ఏది ప్రొడక్షన్ హౌస్ నుంచి లేదు. రంజాన్ వల్ల ఏఆర్ రెహమాన్ అందుబాటులో లేని కారణంగా టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పని కొంత పెండింగ్ లో ఉన్నట్టు వినికిడి.

బాలీవుడ్ లో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న దురంధర్ ది రివెంజ్ రికార్డులను బద్దలుకొట్టే సత్తా రామాయణకే ఉందని ట్రేడ్ నమ్ముతోంది. దానికి తగ్గ హైప్ గ్రౌండ్ లెవెల్ లో కనిపించాలి. ఏది ఎలా ఉన్నా శ్రీరామనవమికి ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత దర్శక నిర్మాతల మీద ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లలో విడుదల ప్లాన్ చేసుకున్న రామాయణ పార్ట్ 1 ఇంత స్లోగా ఉంటే పనవ్వదు. పెద్ద రిస్కు ఉన్న బడ్జెట్ కాబట్టి దానికి అనుగుణంగానే ప్రచారాలు హోరెత్తాలి.

This post was last modified on March 24, 2026 10:17 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

27 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

33 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

48 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago