Movie News

సీక్వెల్ గురించి తెలియదన్న యువ హీరో

కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న స‌మ‌యంలో అత‌డికి గొప్ప ఉప‌శ‌మ‌నాన్ని అందించిన సినిమా.. క‌. మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ల‌ను త‌ల‌పించేలా సాగిన ఈ సినిమా.. 2024 దీపావ‌ళికి విడుద‌లై తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. కిర‌ణ్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. కిర‌ణ్ ఈ సినిమాను ఎంత‌గా ఓన్ చేసుకున్నాడో అంద‌రికీ తెలుసు.

కెరీర్లో ఒక గ్యాప్ తీసుకుని చాలా టైం పెట్టి, శ్ర‌ద్ధగా ఈ సినిమాను పూర్తి చేశాడు. పెర్ఫామెన్స్ ప‌రంగా కూడా ది బెస్ట్ ఇచ్చాడు. ఇలాంటి హిట్ మూవీకి సీక్వెల్ అంటే ఆటోమేటిగ్గా అదే హీరో లీడ్ రోల్ చేస్తాడ‌ని అనుకుంటాం. కానీ ఆ చిత్ర ద‌ర్శ‌కులు సందీప్ సుజీత్.. నిర్మాత‌లు క‌లిసి వేరే ఆలోచన చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ఈ సీక్వెల్‌ను ప‌ట్టాలెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇది కిర‌ణ్ అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేసింది.

మ‌రి ఈ సీక్వెల్ త‌న చేతి నుంచి వెళ్లిపోవ‌డంపై కిర‌ణ్ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందామ‌ని విలేక‌రులు ప్ర‌య‌త్నిస్తే.. అత‌ను దీన్ని కాంట్ర‌వ‌ర్శీ చేయ‌కుండా సింపుల్‌గా జ‌వాబిచ్చాడు. క సీక్వెల్ ఇంకెవ‌రో చేస్తున్నార‌ట క‌దా, మీరెందుకు చేయ‌ట్లేదు అని అడిగితే.. ఏమోనండీ దాని గురించి ఏ చ‌ర్చా జ‌ర‌గ‌లేదు, ఎవ‌రూ నాతో మాట్లాడ‌లేదు, ఆ చ‌ర్చ నా వ‌ర‌కు రాలేదు అని కిర‌ణ్ వ్యాఖ్యానించాడు.

కిర‌ణ్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే.. సీక్వెల్ వేరొక‌రితో తీయ‌బోతున్నార‌ని తెలిసి ఆ విష‌యాన్ని లైట్ తీసుకున్న‌ట్లున్నాడు. దీన్ని వివాదం చేయ‌కూడ‌దన్న ఉద్దేశంతో అత‌ను హుందాగా స్పందించిన తీరు ప్ర‌శంస‌నీయం.

ఇక త‌న నిర్మాణంలో తెర‌కెక్కిన తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ప్రేక్షకుల‌ను చాలా ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లే వింటేజ్ ఫ‌న్ ఫిలిం అని కిర‌ణ్ చెప్పాడు. ఈ సినిమా వ‌ల్ల త‌న‌కు డ‌బ్బులు వ‌స్తాయో లేదో కానీ.. దీని కోసం ప‌ని చేసిన కొత్త న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల జీవితాలు మాత్రం మారిపోతాయ‌ని అత‌ను ధీమా వ్య‌క్తం చేశాడు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

This post was last modified on March 21, 2026 11:45 pm

Share

Recent Posts

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

2 hours ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

2 hours ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

3 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

7 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

7 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

7 hours ago