మహేష్ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. ఇంకా అతని కొత్త సినిమా సెట్టెక్కలేదు. పరశురామ్‍తో ‘సర్కారు వారి పాట’ మహేష్ ఎప్పుడో ఓకే చేసేసుకున్నాడు. అయితే ఆ చిత్రానికి అడుగడుగునా ఆటంకాలెదురవుతున్నాయి. నవంబరులోనే మొదలు పెట్టాలని చూసిన షూటింగ్‍కి అవాంతరమొచ్చింది. విదేశాలలో షూటింగ్ కష్టమవుతుందని లోకల్‍గానే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే జనవరిలో చేసే షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లేదా అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు.
కానీ ఇప్పుడు కొత్త కరోనా వచ్చి యుకె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడికి విమాన రాకపోకలు బంద్ చేసారు. దీంతో అది ఎప్పటికి ఒక దారికి వస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. విదేశీ షూటింగ్ అయితే సర్కారు వారి పాటకు తప్పనిసరి అట. అయితే అది ఏ దేశంలో చేయాలో, ఎప్పుడు చేయాలో ఇప్పుడు నిర్మాతలు తేల్చుకోలేకపోతున్నారు.
ఈ సినిమా కంటే ముందుగా వేరే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అప్పట్లో మహేష్ చేసినా కానీ తర్వాత విరమించుకున్నాడు. సర్కారు వారి పాట కాస్త ఆలస్యంగా మొదలయినా కానీ దసరా టైమ్‍కి వస్తుందని ఫాన్స్ ఆశ పడుతున్నారు. ఒకవేళ షూటింగ్‍లో మరింత జాప్యం ఎదురయితే కనుక విడుదల తేదీ కూడా ఇంకా వెనక్కు వెళ్లవచ్చు.
This post was last modified on December 22, 2020 4:02 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…