మామూలుగా బిగ్ బాస్ తెలుగు విజేతగా దక్కే ప్రైజ్ మనీ రూ.50 లక్షలు. తొలి సీజన్ నుంచే ఇంతే మొత్తంలో బహుమతి అందిస్తున్నారు. ఐతే ఈ షోలో పాల్గొనే కొందరి స్థాయి ప్రకారం చూస్తే రూ.50 లక్షలు పెద్ద విషయమే కాదు అనిపిస్తుంది. అది చాలా తక్కువ ప్రైజ్ మనీ అనిపిస్తుంది. కానీ ఈ ప్రైజ్ మనీతో పాటుగా పార్టిసిపెంట్ల స్థాయిని బట్టి వారానికి ఇంత మొత్తం అని నిర్దిష్టమైన పారితోషకం కూడా ఉంటుంది.
విజేతకు ప్రైజ్ మనీతో పాటు ఆ డబ్బులు కూడా వస్తాయి. దీనికి తోడు ‘బిగ్ బాస్’ ద్వారా వచ్చే ఫేమ్.. తద్వారా దక్కే ప్రయోజనం అదనం అన్నమాట. ఈ సీజన్లో విజేతగా నిలిచిన అభిజిత్‌కు అనూహ్యంగా ప్రైజ్ మనీలో యాభై శాతం కోత పడిపోయింది. మూడో స్థానంతో సరిపెట్టుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నందుకు సోహైల్‌కు ఇచ్చిన రూ.25 లక్షల మొత్తాన్ని విన్నర్ ప్రైజ్ మనీలో తగ్గించేశారు.
దీంతో విజేతకు, మూడో స్థానంలో నిలిచిన వ్యక్తికి ప్రైజ్ మనీ విషయంలో ఏమీ తేడా లేకపోయింది. ఐతే అభిజిత్‌కు ప్రైజ్ మనీ కాకుండా దక్కిన పారితోషకం తక్కువేమీ కాదు. అతను హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు వారానికి రూ.4 లక్షలు పుచ్చుకునేలా ఒప్పందం కుదిరింది. మొత్తం 15 వారాలు షో నడిచిన నేపథ్యంలో వారానికి రూ.4 లక్షల చొప్పున మొత్తం పారితోషకంగా అతడికి రూ.60 లక్షలు వచ్చాయి. దీనికి తోడు ప్రైజ్ మనీ కింద రూ.25 లక్షలు వచ్చాయి. అంటే మొత్తం రూ.85 లక్షల అతడి ఖాతాలో పడ్డాయన్నమాట.
ఇక షో ద్వారా అభిజిత్‌కు వచ్చిన గుర్తింపు తక్కువేమీ కాదు. ఎనిమిదేళ్ల కిందట ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నటించాక చాలా త్వరగానే అభిజిత్ ఫేడ్ అవుట్ అయిపోయాడు. అతను తర్వాత నటించిన సినిమాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక దశ దాటాక సినిమా అవకాశాలూ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడానికి అవకాశముంది. అలాగే మోడలింగ్ ద్వారానూ ఆర్జనకు అవకాశముంది.
This post was last modified on December 22, 2020 2:47 pm
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎదురుకున్న ఇబ్బందులు, వేరొకరితో నేపధ్య సంగీతం…
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయం.. నాలుగు రోజులు కూడా తిరగక ముందే బుట్టదాఖలైంది. ఇది…