Movie News

ఈసారి ట్రోల్ మెటీరియల్‌ కాదు.. సీరియస్ సినిమా

తమిళనాట శరవణ స్టోర్స్ సహా పలు వ్యాపారాలతో వేల కోట్ల స్థాయికి ఎదిగిన వ్యక్తి శరవణన్. తన పేరుకు ముందు తనే పెట్టుకున్న ‘లెజెండ్’ అనే టైటిల్‌తోనే అతను హీరోగా అరంగేట్రం చేశాడు. దాని మీద భారీ బడ్జెట్ కూడా పెట్టాడు. రోబోలా ఉండే తన అవతారం.. పేలవమైన నటన.. విపరీతమైన బిల్డప్పులతో సాగిన సన్నివేశాలు.. ‘లెజెండ్’ను ఒక ట్రోల్ మెటీరియల్‌గా మార్చేశాయి. ఇప్పటికీ ఆ సినిమా మీమ్ టెంప్లేట్స్ సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.

‘లెజెండ్’ సినిమా రిలీజయ్యాక మూడేళ్ల పాటు శరవణన్ మళ్లీ ఇంకో మూవీ చేయలేదు. దీంతో ఇక అతను మళ్లీ కెమెరా ముందుకు ముందుకు రాడేమో అనుకున్నారు. కానీ శరవణన్ గత ఏడాది కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. ధనుష్‌తో ‘కోడి’ లాంటి హిట్ మూవీ తీసిన దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ‘లీడర్’ అనే సినిమాలో నటించాడు. ఇంతకుముందే దీని గ్లింప్స్ రిలీజైంది. తాజాగా తమిళ, తెలుగు భాషల్లో ‘లీడర్’ టీజర్ లాంచ్ చేశారు.

ఈ టీజర్ చూస్తే.. శరవణన్ ఈసారి ట్రోల్స్‌ బారిన పడే కామెడీ మూవీ తీయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అతను తన లుక్ మార్చుకోవడమే కాదు.. కంటెంట్ మీద కూడా బాగానే దృష్టిపెట్టినట్లున్నాడు. పేరున్న దర్శకుడైన దురై.. హీరో ఎవరన్నది చూడకుండా తన స్టయిల్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ తీసినట్లున్నాడు. ప్రమాదంలో పడ్డ తన కూతురిని కాపాడుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్లే హీరో కథ ఇది.

ఇందులో శరవణన్.. శక్తివేల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. అతడికి జోడీగా టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించింది. ఆమెకు తోడు ఆండ్రియా, కిక్ శ్యామ్, లాల్.. ఇలా పెద్ద కాస్టింగే పెట్టుకున్నారు. దేశవిదేశాల్లో భారీ ఖర్చు పెట్టి సినిమా తీశారు. యాక్షన్ ఘట్టాలు స్టార్ హీరోల సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఉన్నాయి. ఈసారి ఖర్చునే కాక కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్నట్లున్నాడు శరవణన్. ఏప్రిల్లో ‘లీడర్’ రిలీజ్ కాబోతోంది. మరి హీరోగా వెలిగిపోవాలన్న అతడి కోరిక ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి.

This post was last modified on March 5, 2026 10:04 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

2 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

4 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

4 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

5 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

8 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

8 hours ago