మెగాస్టార్ చిరంజీవి మామూలు స్పీడులో లేడిప్పుడు. కరోనా విరామం తర్వాత ‘ఆచార్య’ సినిమాలో చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన.. త్వరలోనే దాని కథ ముగించనున్నారు. ఇటీవలే ఆయన ‘లూసిఫర్’ రీమేక్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని.. ఫిబ్రవరిలో దీని షూటింగ్ మొదలవుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత చిరు చేసే సినిమా విషయంలో సంకేతాలు ఉన్నాయి కానీ.. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ‘బిగ్ బాస్’ ఫైనల్ సందర్భంగా చిరు స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి స్పష్టత ఇచ్చాడు. ‘లూసిఫర్’ రీమేక్ తర్వాత కూడా తాను చేయబోయేది రీమేకే అని.. అది తమిళం హిట్ ‘వేదాలం’ ఆధారంగా తెరకెక్కనుందని చిరు చెప్పాడు. అలాగే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడని కూడా ఖరారు చేశాడు.
‘బిగ్ బాస్-4’లో పాల్గొన్న కంటెస్టెంట్లందరూ ఫైనల్ వేడుకకు హాజరు కాగా.. అందులో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ దివి దగ్గరికొచ్చేసరికి రొమాంటిక్ టోన్‌లోకి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి తనకెంతో నచ్చిందని.. ఆ ఇంప్రెషన్‌తోనే ‘వేదాలం’ రీమేక్‌లో తనకు ఓ పాత్ర ఇస్తే బాగుంటుందని దర్శకుడు మెహర్ రమేష్‌కు చెప్పానని.. అతను ఆమెకు ఒక పోలీస్ క్యారెక్టర్ కన్ఫమ్ చేశాడని చిరు వెల్లడించాడు. ఈ పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూడమని కూడా తాను చెప్పినట్లు చిరు పేర్కొనడం విశేషం.
ఏడెనిమిది నెలల తర్వాత తాను, దివి కలిసి నటించబోతున్నట్లు ఆయన ఖరారు చేశాడు. మరోవైపు సోహైల్‌కు సైతం ఒక కమిట్మెంట్ ఇచ్చాడు చిరు. తాను ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని.. ఆ సినిమా ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన తనను ఆశీర్వదించాలని సోహైల్ కోరగా.. ఆ ఈవెంట్ తన చేతుల మీదుగా జరిపిస్తానని అన్నాడు చిరు. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో ఒక క్యామియో చేసే అవకాశం ఇవ్వాలని అన్నాడు చిరు. సోహైల్ అంతకంటే నాకేం కావాలి సార్ అంటే.. కోట్ల మంది ముందు హామీ ఇస్తున్నా, నువ్వు సినిమా తీస్తే అందులో క్యామియో చేస్తా అని చిరు అని నొక్కి వక్కాణించడం విశేషం.
This post was last modified on December 21, 2020 1:26 pm
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…