అనుకోకుండా ఓ చిన్న సినిమా పెద్ద హిట్టవడం.. అందులో నటించిన హీరో హీరోయిన్లకు వరుసగా అవకాశాలు రావడం.. వాటి నుంచి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకోక, చేతికొచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుందామని చూడటం.. ఈ క్రమంలో ఎంత వేగంగా పైకెదిగారో అంతే వేగంగా కింద పడటం ఇండస్ట్రీలో ఎప్పడూ చూసే వ్యవహారాలే. ‘ఆర్ఎక్స్ 100’ హీరో హీరోయిన్లిద్దరి పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు.
కొన్నేళ్ల కిందట ‘కుమారి 21 ఎఫ్’తో పేరు సంపాదించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కూడా ఒక దశ దాటాక ఇలాంటి పరిస్థితికే చేరారు. ముఖ్యంగా హెబ్బా అయితే తన తలుపు తట్టిన ప్రతి సినిమానూ ఒప్పేసుకుని చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయింది. చివరికి ఈ మధ్య వ్యాంప్ తరహా పాత్రల స్థాయికి పడిపోయింది. చివరగా ‘భీష్మ’ సినిమాలో ఆమె పాత్ర చూసి అయ్యోపాపం ఈ అమ్మాయి పరిస్థితి ఇలా తయారైందేంటి అనుకున్నారు జనాలు.
రామ్ హీరోగా తెరకెక్కిన ‘రెడ్’లో ఒక హాట్ ఐటెం సాంగ్ చేసిన హెబ్బాకు కథానాయికగా అయితే అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి వ్యాంప్ క్యారెక్టర్లు, ఐటెం సాంగ్‌లతో ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో తెలియదు. ఐతే ఇలాంటి సమయంలో ఆమెకు వెబ్ సిరీస్‌ల రూపంలో రెండు అవకాశాలు తలుపు తట్టినట్లు సమాచారం.
నెట్ ఫ్లిక్స్ సంస్థ తీయబోయే ఆ రెండు వెబ్ సిరీస్‌లు అడల్ట్ రేటెడ్ స్టయిల్లో ఉంటాయని.. హెబ్బా బోల్డ్ క్యారెక్టర్లు చేయబోతోందని అంటున్నారు. ఆల్రెడీ సినిమాల్లో ఎంత హాట్‌గా అయినా కనిపించడానికి రెడీ అన్నట్లుగా ఉంది హెబ్బా వ్యవహారం.
తెలుగులో వెబ్ సిరీస్‌ల సంస్కృతి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. బాలీవుడ్ స్టయిల్లో కొంచెం హాట్‌గా సిరీస్‌లు ఇంకా మొదలవలేదు. ‘లస్ట్ స్టోరీస్’తో ఆ ట్రెండు ఊపందుకునేలా ఉంది. ఈలోపు హెబ్బా కూడా రెండు వెబ్ సిరీస్‌ల్లో బోల్డ్ రోల్స్ చేయడానికి సై అన్నట్లుంది.
This post was last modified on May 4, 2020 1:18 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…