Movie News

వివాదాస్పద సినిమాకు కోర్టు బ్రేకు

రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువు ఇస్తూ ఆలోగా తదుపరి విచారణను పూర్తి చేయాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ వచ్చిన సినిమాకు ఇలా చివరి నిమిషంలో బ్రేక్ పడటం ఊహించని పరిణామం కావడంతో సుప్రీమ్ కోర్టుకు వెళ్లేందుకు నిర్మాత సిద్ధమవుతున్నట్టు ముంబై టాక్. అయితే షోలకు కేవలం కొద్దిగంటల ముందు ఇది పరిష్కారం అవుతుందా అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయ్యింది.

గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ 2 మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేరళ రాష్ట్రం మీద మచ్చ తెచ్చే ప్రయత్నంగా పేర్కొంటూ ఆల్రెడీ పలు కేసులు దాఖలు కాగా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ వివిధ సమావేశాల ద్వారా తమ ప్రయత్నాన్ని సమర్ధించుకోవడానికి చూస్తున్నారు.

నిజ జీవితంలో లవ్ జిహాద్ బారిన పడిన కొందరు బాధితులను తీసుకొచ్చి మీడియా సమావేశం పెడితే, వాళ్ళలో ఎవరూ కేరళకు చెందిన వాళ్ళు లేకపోవడం పెద్ద దుమారం రేపింది. అలాంటప్పుడు కేరళ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారని జర్నలిస్టులు సైతం ఆక్షేపణ వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు రేపు దేశవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన కేరళ స్టోరీ 2 చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చింది. నిజానికి కేరళ స్టోరీ మొదటి భాగం వచ్చినప్పుడు కూడా కాంట్రావర్సీ రేగింది. అయినా సరే ఎలాగోలా విడుదలకు రూట్ క్లియర్ చేసుకుని మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసుకుంది.

కేరళ స్టోరీ 2 కూడా అదే స్థాయిలో రాబడుతుందనే ధీమాలో టీమ్ ఉంది. అయితే ట్రైలర్ లో చూపించిన విజువల్స్, ఒక సామాజిక వర్గ మనోభావాలను గాయపరిచేలా ఉన్న సన్నివేశాల నేపథ్యంలో వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. హిందీతో పాటు తెలుగు తమిళ ఇతర ప్రధాన భాషల్లో కేరళ 2 స్టోరీని మేకర్స్ సిద్ధం చేశారు.

This post was last modified on February 26, 2026 3:56 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

3 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

4 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago