లాక్ డౌన్ షరతులు తొలగించారు.. థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. కొత్త సినిమాలు కొన్ని రిలీజయ్యాయి. అయినా సరే.. సందడి లేదు. నామమాత్రపు షోలు.. ఖాళీగా థియేటర్లు.. ఇదీ పరిస్థితి. రామ్ గోపాల్ వర్మ నుంచి కరోనా వైరస్ అనే సినిమాతో పాటు హాలీవుడ్ మూవీ టెనెట్ తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు కానీ.. వాటి వల్ల ఇండస్ట్రీలో ఎలాంటి కదలిక కనిపించలేదు.
కొత్త సినిమా రిలీజవుతున్నపుడు ఉండే సందడి ఎంతమాత్రం లేకపోయింది. ఆ సందడి ఇప్పుడు నెమ్మదిగా మొదలవుతోంది పరిశ్రమలో. ఎందుకంటే లాక్ డౌన్ తర్వాత తొమ్మిది నెలలకు పైగా విరామం అనంతరం ఒక పేరున్న సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. అదే.. సోలో బ్రతుకే సో బెటర్. ఇంకో వారం లోపే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది.
ముందు క్రిస్మస్‌కు థియేట్రికల్ రిలీజ్ అని ఈ సినిమా పోస్టర్ వదిలినపుడు జనాలకు నమ్మకం కలగలేదు. జనాలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే మూడ్‌లో ఉన్నట్లుగా కనిపించడం లేదు. పైగా 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాను నడిపించాలి. ఈ పరిస్థితుల్లో నిజంగా ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందా అన్న అనుమానం జనాల్ని వెంటాడింది. కానీ చిత్ర బృందం మాటకు కట్టుబడి వచ్చే శుక్రవారం తమ చిత్రాన్ని విడుదల చేయబోతోంది.
మామూలుగా కొత్త సినిమా రిలీజ్ ముంగిట అది రిలీజయ్యే థియేటర్ల జాబితాతో పేపర్లలో యాడ్స్ ఇస్తారు. అప్పుడే సినిమా విడుదల ఖరారైనట్లు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు సంబంధించి హైదరాబాద్, ఇతర తెలంగాణ మెయిన్ సిటీస్‌లో రిలీజ్ థియేటర్లతో ఆ పోస్టర్ వచ్చేసింది. అది ట్విటర్లో హల్‌చల్ చేస్తోంది. తొమ్మిది నెలలకు పైగా విరామం తర్వాత మళ్లీ ఇలాంటి పోస్టర్ కనిపించడంతో టాలీవుడ్‌లో మళ్లీ సందడి నెలకొంది.
This post was last modified on December 19, 2020 8:07 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…